ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌లో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్స్, పవర్ ఫుల్ మోటార్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ఎంపవర్డ్ ప్లస్ ట్రిమ్ రూ. 16.99 లక్షల వరకు ఉంటుంది.
45kwh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మరింత శక్తివంతమైనదని టాటా మోటార్స్ పేర్కొంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 489 కిమీ ప్రయాణం చేయొచ్చు. నగరాల్లో సైతం 350 కిమీ నుండి 370 కిమీల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కొత్త నెక్సాన్ ఈవీ 45kWh బ్యాటరీ కేవలం 48 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. మునుపటి మోడల్‌లో సుమారు 56 నిమిషాలు పడుతుంది. పెద్ద బ్యాటరీ కారణంగా కారు బరువు కొద్దిగా పెరుగుతుంది.
Also Read: Tata Punch Camo Edition: ‘టాటా పంచ్’ స్పెషల్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
నెక్సాన్ ఈవీలో కొన్ని కొత్త ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తోంది. ముందు భాగంలో పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంక్ (బానెట్‌లో చిన్న స్థలం)ను కూడా అందించింది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, వెహికల్ టు వెహికల్, వెహికల్ టు లోడ్, 7.2kw AC ఫాస్ట్ ఛార్జర్ ఇందులో అందించబడుతోంది. కంపెనీ కొత్త రెడ్ డార్క్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 17.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.