Site icon NTV Telugu

Tata Harrier EV: కిరాక్ లుక్‌లో జూన్ 3న లాంచ్‌కు సిద్దమైన టాటా హారియర్ EV..!

Tata Harrier Ev

Tata Harrier Ev

Tata Harrier EV: భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. వినూత్నమైన డిజైన్లు, బలమైన నిర్మాణం, ఆధునిక సాంకేతికతతో దేశీయ మార్కెట్లో ముందంజలో ఉంది. టాటా నెక్సన్ EVతో విద్యుత్ వాహనాల విభాగంలో ముందస్తు అడుగులు వేసిన టాటా మోటార్స్, ఇప్పుడు హారియర్ EVను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, హారియర్ EVని 2025 జూన్ 3న లాంచ్ చేయనుంది. ఇటీవలే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ మోడల్‌ను ప్రదర్శించగా.. అప్పుడే దాని డిజైన్‌ను మనం చూశాం. కానీ, టెక్నికల్ వివరాలు మాత్రం కంపెనీ ఇప్పటికీ గోప్యంగా ఉంచింది కంపెనీ.

Read Also: ప్రపంచంలో ఉత్తమ వంటకాలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే!

హారియర్ EV టాటా సంబంధిత OMEGA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫారమ్ టాటా హారియర్ డీజిల్ వేరియంట్‌కి కూడా ఉపయోగించబడుతుంది. అయితే, EV వెర్షన్‌కి ప్రత్యేకంగా ఛాసిస్, ఫ్లోర్‌లో కొన్ని మార్పులు చేశారు. కాబట్టి బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రిక్ కాంపోనెంట్లను అమర్చే వీలైంది. దీనిని టాటా “Acti.ev (Gen 2)” ఆర్కిటెక్చర్‌గా పిలుస్తోంది. ఇంకా అధికారికంగా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వెల్లడించనప్పటికీ, హారియర్ EVలో AWD సెటప్ ఉండనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, CURVV EV కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా సుమారు 500 Nm టార్క్ ఉత్పత్తి చేసే అవకాశముంది.

Read Also: NVSS Prabhakar : కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ డీల్‌..? ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన ఆరోపణలు

డీజిల్ హారియర్ డిజైన్‌ను ఎక్కువగా కొనసాగిస్తూ, EV వెర్షన్‌లో కొన్ని ప్రత్యేక లక్షణాలను చేర్చారు. ఇందులో వెర్టికల్ LED హెడ్లైట్స్, బ్లేడ్-షేప్డ్ DRLs, బ్లాక్‌డ్-అవుట్ D-పిల్లర్, ఫ్లోటింగ్ రూఫ్‌లైన్, వెనుక బంపర్లో వర్టికల్‌గా అమర్చిన LED ఫాగ్ లాంప్స్ ఉన్నాయి. అలాగే, 17-ఇంచుల నుండి 19-ఇంచుల వీల్స్ వరకు గల సెటప్ అందించే అవకాశముంది. EV స్పెసిఫిక్ డిజైన్ అంశాలుగా క్రోమ్-ట్రిమ్డ్ ఎయిర్ డ్యామ్, సిల్వర్ బాడీ క్లాడింగ్, “.EV” బ్యాడ్జ్ డోర్లపై, “HARRIER.EV” బ్యాడ్జ్ టైల్గేట్‌పై అమర్చారు.

హారియర్ EVలోని ఇంటీరియర్ డీజైన్ డీజిల్ వేరియంట్‌తో చాలా భాగాలలో సమానంగా ఉంటుంది. ఇందులో ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నాలుగు స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యుయల్-టోన్ డాష్‌బోర్డ్, టచ్ ఆధారిత HVAC కంట్రోల్స్, ఇంకా ప్యానోరామిక్ సన్‌రూఫ్ వంటి సదుపాయాలు ఉంటాయి. జూన్ 3న పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు ఈ EV పై ఆసక్తి కొనసాగుతుంది.

Exit mobile version