NTV Telugu Site icon

After 9 Pub: అర్ధరాత్రి పబ్ లో రైడ్స్.. అదుపులో 35 మంది యువతులు..

After 9 Pubb

After 9 Pubb

బంజారాహిల్స్ కేబిఅర్ పార్క్ సమీపంలోని ‘After 9 pub’ లో అర్దరాత్రి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ రైడ్స్ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న After 9 పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేపిస్తునట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి యువతులు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో దాడులు చేసారు. గతంలో కూడా After 9 పబ్ పై పాలుమార్లు కేసులు నమోదు అయినట్లు సమాచారం.

Also read: PBKS vs CSK: పంజాబ్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పబ్ కి రావడానికి కస్టమర్లనుఆకర్శించడానికి కర్ణాటక గుల్బర్గా నుండి యువతులను రప్పించారు పబ్ నిర్వాహకులు. దాంతో పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేసారు బంజారాహిల్స్ పోలీసులు.

Also read: Rythu Bandhu: రైతులకు గుడ్‌ న్యూస్‌.. ‘రైతుబంధు’ డబ్బులు పడేది అప్పుడే..

పట్టుబడ్డ యువతి యువకుల పూర్తి వివరాలు సేకరించి వారినీ డ్రగ్స్ డిటెక్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు పోలీసులు. బంజారాహిల్స్ after 9 పబ్బులో పట్టుబడ్డ 35 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్ లోని రెస్క్యూ హోమ్ తరలించారు బంజరహిల్స్ పోలీసులు. రైడ్ సమయంలో పోలీసులకు పట్టుబడ్డ వారు గుల్బర్గా, ఏపీ రాష్ట్రానికి చెందిన కొందరు యువతులుగా గుర్తించారు పోలీసులు.