డబ్బు మాయలో పడి ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ముఖ్యంగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విశాఖ నగరంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పూర్ణమార్కెట్ ఏరియాలో నకిలీ నెయ్యి తయారీ డెన్స్ గుర్తించారు. ముఠా లాడ్జి లలో రూమ్స్ తీసుకొని గుర్తుచప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
Also Read:Nizamabad Cybercrime Scam: లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆశ పడతారు.. కానీ!
బళ్లారి నుంచి ఇక్కడికి వచ్చి కల్తీ నెయ్యి తయారు చేస్తోంది ఓ గ్యాంగ్.. వనస్పతి, కొన్ని రకాల కెమికల్స్ కలర్స్ మిక్స్ చేసి కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్నారు. కేజీ రూ. 350 నుంచి 400 ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్లుకు, క్యాటరింగ్ ఏజెన్సీ, బేకరీలకు, స్వీట్ షాపులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. సుమారు 120 కేజీల నకిలీ నెయ్యి గుర్తించారు అధికారులు. ఏడాది నుంచి గుట్టుచప్పుడు కాకుండా కల్తీ నెయ్యి దందాకు పాల్పడుతున్నట్లు తేల్చారు. శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
