NTV Telugu Site icon

Tarun : సీక్రెట్ గా మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరో .. అసలు రహస్యం బయటపెట్టిన తల్లి..

Trun

Trun

టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేశాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన సినిమా జీవితం సాఫీగా సాగితే ఇప్పటికీ రవితేజ లలాగే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతుండేవాడు. కానీ ఆయన జీవితంలో జరిగిన అనుకొని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు.. ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ నడిచాయి.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు..

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈయనకు ముగ్గురు భార్యలు అని గతంలో బాగానే ప్రచారం జరిగింది.. ఈ విషయం పై అప్పట్లో ఎవరు స్పందించలేదు.. దాంతో చాలా మంది అది నిజమని నమ్మేసారు.. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తరుణ్ తల్లి ఈ విషయం పై స్పందించి.. ఆ ముగ్గురు భార్యల వెనుక ఉన్న అసలు రహస్యం బయట పెట్టింది..

తరుణ్ తల్లి రోజా రమణి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.. అక్కడ తరుణ్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నా కొడుకుకు ఇప్పటికే 3సార్లు పెళ్లి జరిగింది అంటూ ఒక షాకింగ్ విషయం చెప్పింది.. మేము చెయ్యలేదు అతను చేసిన సినిమాల్లోకి హీరోయిన్లతో పెళ్లిళ్లు చేశారు. తరుణ్ తో పెళ్లి అయ్యినట్లు రూమర్స్ వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఫోన్లు చేసి అడిగేవారని చెప్పింది.. ఇక తరుణ్ కి క్లోజ్ ఫ్రెండ్స్ త్రిష,ప్రియమణి, శ్రీయ వంటి వాళ్ళు అయితే నాకు ఫోన్ చేసి తెగ ఆటపట్టిస్తుండేవారు.. కానీ తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని బయటపెట్టింది..తను ఎలాంటి అమ్మాయిని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు.. అందుకు సంబందించిన వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది..