Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Tarun Bhaskar Eesha Rebba Marriage Rumors 2026

Tarun Bhaskar – Eesha: పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా?

Published Date :December 13, 2025 , 4:16 pm
By Bhargav Chaganti
Tarun Bhaskar – Eesha: పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘పెళ్లిచూపులు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్… ‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సొగసైన నటి ఈషా రెబ్బతో ప్రేమాయణం నడుపుతున్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వైపు అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వీరిద్దరూ వచ్చే ఏడాది (2026) వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read:Lionel Messi: మెస్సీ ఈవెంట్ మేనేజర్‌ అరెస్ట్.. ఎవరీ సతద్రు దత్తా

తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకత్వంతో పాటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. ఈషా రెబ్బతో కలిసి ఆయన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే మలయాళ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది ప్రేమగా మారిందనే ప్రచారం సినీ వర్గాలలో బలంగా ఉంది. వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరి మధ్య ప్రాంతీయ బంధం కూడా వీరిని మరింత దగ్గర చేసిందని చెబుతున్నారు. ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన తరుణ్ భాస్కర్, యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, తన జీవితంలో గొప్ప ప్రేమకథ ఇప్పుడే నడుస్తోందని పరోక్షంగా చెప్పడం, ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలతో పాటు పలు ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీంతో వీరి రిలేషన్‌షిప్ గురించి అభిమానులలో స్పష్టత వచ్చింది.

Also Read:Thaman: తమిళ్ ఫీలింగ్ ఎక్కువ.. అనిరుధ్‌తో పోలిక.. థమన్ సంచలన వ్యాఖ్యలు!

ఈ వార్తల నేపథ్యంలో, తరుణ్ భాస్కర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఆయనకు ఇదివరకే పెళ్లై, విడాకులు తీసుకున్నట్లుగా కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే, దీనిపై తరుణ్ భాస్కర్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో, ఈ కొత్త బంధంపై, తరుణ్ భాస్కర్ మొదటి వివాహబంధం గురించి అభిమానులు మరింత లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తరుణ్ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తరుణ్ భాస్కర్ లేదా ఈషా రెబ్బ వైపు నుంచి ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఇండస్ట్రీలో వీరి పెళ్లి కబురు దృఢంగా వినిపిస్తోంది. ఇద్దరూ తమ వృత్తి జీవితంలో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. వారిద్దరి నుంచి అధికారిక ప్రకటన వస్తే ఈ శుభవార్తపై మరింత స్పష్టత వస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Eesha Rebba
  • Eesha Rebba relationship news
  • Eesha Rebba wedding news
  • tarun bhaskar
  • Tarun Bhaskar Eesha Rebba marriage

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions