NTV Telugu Site icon

Alekhya Tarakaratna : ఈ జన్మకు నువ్వూ నేను మాత్రమే.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి

Alekya Reddy

Alekya Reddy

నందమూరి తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి తారకరత్న మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ హీరో గా,తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారకరత్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు. నందమూరి వారసుడిగా అందరి మన్ననలను చూరగొన్న నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణిస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఆయన మరణించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కార్డియాక్ అరెస్ట్ కు గురైనా తారకరత్న మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచాడు. అప్పటివరకూ మౌనంగా ఉన్న అలేఖ్య రెడ్డి, తారకరత్న మరణం తర్వాత వారి ప్రేమ వివాహం, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఎమోషనల్ పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తద్వారా తారకరత్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె తన పోస్టులలో వెల్లడిస్తుంది.

Also Read : Samyuktha Menon: అందమే కాదు మనసు కూడా వెన్నే.. విరూపాక్ష బ్యూటీపై నెటిజన్లు ఫిదా

ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరో పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి తన భర్త తారకరత్నతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ జీవితానికి ఇక నువ్వు నేను మాత్రమే.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలని ఇచ్చి వెళ్లావు అంటూ అలేఖ్యరెడ్డి పోస్ట్ లో రాసుకొచ్చింది. వాటితో నేను ముందుకు వెళ్తాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అంతేకాదు మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోలు, తన కుమారుడి ఫోటోలు షేర్ చేసి వీళ్ళే తన స్టార్స్ అంటూ ఆమె పేర్కొంది. నిత్యం తారకరత్నకు సంబంధించిన జ్ఞాపకాలను అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పడానికి ఆమె చేస్తున్న పోస్టులే ఇందుకు నిదర్శనం. తారకరత్నతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె చెబుతున్న తీరు నెటిజన్లను ఆలోచించేలా చేస్తోంది.

Also Read : King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి మూడు కిరీటాలు.. వీటి ప్రత్యేకత ఇదే..

ఆమె మనసులోని బాధను అందరికీ అర్థమయ్యేలా చెబుతోంది అని నెటిజన్స్ అంటున్నారు.. తారకరత్న చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపించడం లేదు.. నిత్యం భర్త జ్ఞాపకాలతో అలేఖ్య రెడ్డి బాధ పడుతూనే ఉంది. అయితే ఆమెను తారకరత్న మృతి బాధ నుంచి బయటకు తీసుకురావాలని, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా చూడాలని, తారకరత్న ఆశయం అలేఖ్యా రెడ్డి ద్వారా నెరవేర్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Show comments