బాలీవుడ్ లో స్పై యాక్షన్ల సిరీస్ చిత్రాలకు పురుడు పోసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్, వార్, పఠాన్, టైగర్3 లాంటి హై యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో మరో స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను ఆగస్టు 14న థియేటర్స్ లోకి తెస్తోంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో సెట్ కావడం, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, వార్ కిది సీక్వెల్ కావడంతో ఈ సినిమాపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎన్టీఆర్ డైహార్ట్ ఫ్యాన్స్. అలాగే ఈ ఫ్రాంచైజీలో స్టార్ హీరోలు నటించి స్పై యాక్షన్ చిత్రాలకు వెయిటేజ్ తీసుకు రావడం, అవన్నీ సక్సెస్ కొట్టడంతో యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఫిక్స్ అవుతున్నారు.
Also Read : SSMB29 : మహేశ్ సినిమాను పక్కన పెట్టిన రాజమౌళి.. వాట్ హ్యాపెనింగ్ జక్కన్న
సినిమాపై బాలీవుడ్ లో బజ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో ఊహించినంత హైప్ రావట్లేదు. టీజర్ సోసో అనిపించగా ట్రైలర్ ఓకే అనిపించింది. కానీ తాజాగా వదిలిన సాంగ్ తారక్ అభిమానుల్ని డైలామాలో పడేసింది. హృతిక్ కు ఇలాంటి సాంగ్ ఉండటం తారక్ కు సరసన హీరోయిన్ లేకపోవడాన్ని మైనస్ గా ఫీలవుతున్నారు. అలాగే సౌత్ ప్రమోషన్స్ డల్ గా సాగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వార్ 2తో పోటీగా రిలీజ్ అవుతున్నకూలీ సౌత్ లో పీక్స్ ప్రమోషన్లు చేస్తుంది. కానీ ఇంకా ఇక్కడ ప్రచారాలకు పదును పెట్టడం లేదు యశ్ రాజ్ ఫిల్మ్స్. ఇదే తారక్ ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. అందుకే సౌత్ లో మూవీపై క్రేజ్, హైప్ రావడం లేదని తెగ ఫీలవుతున్నారు. WAR సీక్వెన్స్ కు మించిన స్కేల్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ను సాటిస్ ఫై చేసేలా ప్రమోషనల్ స్టంట్ కనిపించడం లేదు. ఇంకా రిలీజ్ కు కొద్దీ రోజులే ఉన్న నేపథ్యంలో యశ్ రాజ్ ఫిల్మ్ ఏమి చేస్తుందో చూడాలి.