Tapan Deka: మరో ఏడాది కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tapan Deka: కేంద్ర ప్రభుత్వం నేడు (మే 20)న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ పొడిగింపు 2025 జూన్ 30 తర్వాత ప్రారంభమై 2026 జూన్ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుంది. తపన్ కుమార్ డేకా 1988 బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2022 జూలై 1న ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు, ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ముఖ్యంగా కౌంటర్-టెర్రరిజం విభాగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Read Also: Looting bride: 25 మందిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ.. దోచుకుని పారిపోవడం ఇమె స్టైల్..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
దేశీయ భద్రత మరియు ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆయన అనుభవం, నైపుణ్యం దేశ భద్రతకు కీలకంగా మరీనా నేపధ్యంలో ఈ పొడిగింపు నిర్ణయం, ప్రభుత్వానికి ఆయనపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పొడిగింపు, ప్రస్తుత విధాన నిబంధనలు అయిన FR 56(d), Rule 16(1A) ప్రకారం కేంద్రానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి “ప్రజా ప్రయోజనం” కోణంలో మంజూరు చేయబడింది. తపన్ కుమార్ డేకాకు ఉగ్రవాదం, మౌలికవాదంపై సుదీర్ఘ అనుభవం ఉంది. పాకిస్తాన్‌లో మూలాలు ఉన్న ఉగ్రవాద ఘటనలపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఆయన, ఇటీవలే ఫహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనల సందర్భంలో ఇండియా చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” వంటి ప్రతిచర్యలతో సంబంధం కలిగివున్నారు.
Read Also: Marriage Scam: భాగ్యనగరంలో పెళ్లి పేరుతో మాయ లేడీలు.. తస్మాత్ జాగ్రత్త..!
తపన్ డేకా ఉత్తరాదిన రాష్ట్రాలే కాకుండా.. ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవం ఉన్న అధికారి. జమ్మూ కాశ్మీర్‌లో వచ్చిన అనేక సంక్షోభాలను పరిష్కరించడంలో కేంద్రానికి అతను ముఖ్యమైన సంప్రదింపుల వ్యక్తిగా నిలిచారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!