2023 అక్టోబర్ 21న కాళేశ్వరంకు చెందిన మేడిగడ్డ ప్రాజెక్టు ఏడవ బ్లాక్‌లోని 19-21 పియర్స్ కుంగిపోయాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అదే సమయంలో అన్నారం ప్రాజెక్టు ముందుభాగంలో కూడా బుంగపడి నీరు బయటకు వచ్చిందని, ఈ రెండు ప్రమాద ఘటనలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంలో సర్వత్రా అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించిందని, న్యాయ విచారణ కాకుండా సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నామన్నారు. స్వతంత్ర సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ తదితర శాఖలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందేనన్నారు.
ఈ పరిస్థితుల్లో సీబీఐకి అప్పజెప్పడమంటే బ్లాక్‌మెయిలింగ్‌కు కేంద్ర ప్రభుత్వానికి అవకాశమివ్వడమేనన్నారు. నేటికీ ప్రాజెక్టు మొత్తం వ్యయ అంచనా 1.27లక్షల కోట్లు కాగా, ఇప్పటివరకు 93వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వివిధ బ్యాంకుల ద్వారా అప్పు రు.87,449.16 కోట్లు మంజూరు కాగా, అందులో రు.71,565.69 కోట్లు విడుదలై ఖర్చు జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన ఖర్చు, నాణ్యత, నిధుల దుర్వినియోగం తదితరాలన్నింటిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, రాజకీయ పార్టీలు, నీటిపారుదల నిపుణులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నదన్నారు.
