Site icon NTV Telugu

Tamil Nadu: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. రూ.3,000 నగదుతో పాటు ప్రత్యేక ప్యాకేజీ..!

Tamil Nadu Pongal

Tamil Nadu Pongal

Tamil Nadu: 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా, అలాగే కొత్త ఏడాదిలో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు భారీగా ఆర్థిక, సామగ్రి సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.3,000 నగదు సహాయంతో పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందజేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ జనవరి రెండో వారం ప్రారంభించనున్నారు.

Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!

ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి జనవరి తొలి వారంలోనే ఇందుకు సంబంధించి టోకెన్ల పంపిణీ జరుగుతుంది. రేషన్ షాపు సిబ్బంది ఇంటింటికి వెళ్లి టోకెన్లు అందజేస్తారు. టోకెన్‌పై సూచించిన తేదీన లబ్ధిదారులు తమకు కేటాయించిన రేషన్ షాపులో నగదు సహాయం, గిఫ్ట్ హ్యాంపర్‌ను పొందవచ్చు. ఇక పొంగల్ 2026 గిఫ్ట్ హ్యాంపర్‌లో ఏమేం ఉంటాయంటే..

* 1 కిలో ముడి బియ్యం
* 1 కిలో చక్కెర
* ఒక పూర్తి పొడవాటి చెరుకు
* ఉచిత ధోతీ, చీర
* జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకులు ఉండనున్నాయి.

Pooja Hegde : మళ్ళీ ఫామ్‌లోకి పూజా హెగ్డే.. లక్కు తగిలితే మాత్రం..!

గత ఏడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్‌కే పరిమితమైన ఈ పథకాన్ని ఈసారి రూ.3,000 నగదు సహాయం అందించడం ద్వారా ప్రభుత్వ సహాయం గణనీయంగా పెరిగింది. పండుగ ఖర్చులపై కుటుంబాలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఊరట కలిగించేలా ఇది అదనపు ప్రయోజనం కలగనుంది.

Exit mobile version