Site icon NTV Telugu

Tamilnadu Minister: పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తమిళనాడు మంత్రి.. వీడియో వైరల్

Tamilnadu Minister

Tamilnadu Minister

Tamilnadu Minister: తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్‌కు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకపోవడంతో ఆయన హంగామా సృష్టించారు. తిరువళ్లూరులో కూర్చోవడానికి కుర్చీ తీసుకురావడంలో జాప్యం చేసినందుకు మంత్రి ఎస్ఎం నాసర్ డీఎంకే పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఎస్ఎం నాసర్ రాష్ట్ర పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Maruti Suzuki: 11వేల గ్రాండ్ విటారా కార్‌లు రీకాల్.. కారణం ఇదే..

గత ఏడాది, కేంద్ర ప్రభుత్వం పాలపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) విధించిందని తప్పుడు సమాచారం అందించిన తర్వాత ఎస్‌ఎం నాసర్ వార్తల్లో నిలిచారు.డీఎంకే మంత్రి నవంబర్ 4, 2022న ప్రభుత్వ యాజమాన్యంలోని ఆవిన్‌లో పాల ధరల పెరుగుదల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆవు పాల సేకరణ ధర రూ.32 నుంచి రూ.35కి, గేదె పాల సేకరణ ధర రూ.41 నుంచి రూ.44కి పెంపు, ఆవిన్ ఫుల్‌క్రీమ్ మిల్క్ (ఆరెంజ్ ప్యాకెట్) ధర రూ.12 పెంచి రూ.60 రూపాయలు చేసిందని ఆయన వెల్లడించారు. డీఎంకే మంత్రి మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం పాలపై కూడా జీఎస్‌టీ విధించింది. ఇది అపూర్వమైన సంఘటన. పాలపై జీఎస్టీ విధించిన పర్యవసానంగా పాల విక్రయ ధర పెరిగింది. జీఎస్టీ నుంచి పాలను మినహాయించడంపై డీఎంకే మంత్రికి తెలియకపోవడమే విడ్డూరమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై విమర్శించారు.

 

Exit mobile version