Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Jail Escape: తమిళనాడులోని తేని జిల్లా సబ్ జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. జైలు సిబ్బందిపై దాడి చేసి ఖైదీలు తప్పించుకున్నారు. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించి.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తెక్కంపట్టి జైలులో ఉన్న ఖైదీలు అనారోగ్యంగా ఉందని చెప్పి.. జైలు సిబ్బందిని సెల్‌లోకి రప్పించారు. ఆపై సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారైన 17 మందిలో ఎక్కువ మంది మదురై జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమై ఖైదీల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలు చేపట్టారు. పరారైన ఖైదీల్లో ఒకరిని తిరిగి అరెస్ట్ చేశారు. దాదాపు 16 ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. గాలింపు చేపట్టారు.
Also Read
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
- IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
- Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
ఘటన గురించి సమాచారం అందుకున్న తేని జిల్లా ఎస్పీ ప్రవీణ్ గౌతమ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తేని జిల్లాతో పాటు పొరుగు జిల్లాల పోలీసు బలగాలు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జైలు వెనుక అటవీ ప్రాంతంలోకి ఖైదీలు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఖైదీల దాడిలో గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఖైదీలు పరారయ్యేందుకు ముందుగా ఒకరు మూర్ఛ నాటకమాడినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా