Site icon NTV Telugu

Madras High Court: భర్త లేదా భార్య ఎవరి పేరు మీదున్న.. ఆస్తిపై ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది: హైకోర్టు

High Court

High Court

Madras High Court: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఒక కేసును విచారణలో భాగంగా గృహిణిగా తన భర్త ఆస్తిని సంపాదించడంలో భార్య సమానంగా సహకరిస్తుందని వ్యాఖ్యానించింది. ఈ వాస్తవాన్ని ఆధారం చేసుకొని ఏ మహిళకు ఇంటి విషయాల్లో ఆమె చేసే సాయం విలువ లేదని చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది. భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా ఉంటుందని కోర్టు పేర్కొంది. లైవ్ లాలోని ఒక నివేదిక ప్రకారం, భార్య మద్దతు లేకుండా భర్త డబ్బు సంపాదించలేడు లేదా ఉద్యోగం చేయలేడు అని జస్టిస్ కృష్ణన్ రామసామి అన్నారు. భార్య అతని కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆస్తిని భార్య పేరు మీద లేదా భర్త పేరు మీద కొనుగోలు చేసినా, అందులో ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి. ఇద్దరి కృషి, పొదుపు లేకుండా ఎలాంటి ఆస్తిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని నివేదికలో చెప్పబడింది.

Read Also:Vasantha Krishna Prasad: ఐదేళ్ళు మంత్రిగా పనిచేసి మైలవరంలో డ్రైనేజీలు ఎందుకు కట్టించలేదు..?

భార్యాభర్తలను కారుకు రెండు చక్రాల మాదిరిగా చూస్తే ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని జస్టిస్ రామస్వామి అన్నారు. భర్త బయటకు వెళ్లి డబ్బు సంపాదిస్తే, భార్య కూడా ఇంట్లోనే ఉంటూ అందరినీ చూసుకుంటుంది. ఇద్దరూ కుటుంబ సంక్షేమానికి సహకరిస్తారు. కుటుంబంలో ఏది జరిగినా అందులో ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఒక మహిళ కుటుంబం మొత్తానికి అంకితమై ఆ తర్వాత ఆమె అలా రిక్తహస్తాలతో మిగిలిపోతే అది తప్పని అన్నారు. విచారణ సందర్భంగా జస్టిస్ రామసామి మాట్లాడుతూ.. గృహిణి మహిళల ప్రయత్నాలకు ప్రామాణికతను కల్పించే చట్టాన్ని ఇంతవరకు రూపొందించలేదన్నారు. వారి త్యాగాన్ని పురస్కరించుకునే విషయంలో ఆ మహిళల సహకారం కోర్టుకు బాగా అర్థమవుతుందని ఆయన అన్నారు.

Read Also:Meghalaya High Court: 16 ఏళ్ల బాలుడితో సంబంధం..అరెస్టు.. విడుదల చేసిన కోర్టు

2016లో ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. నిజానికి ఒక జంట 1965లో పెళ్లి చేసుకున్నారు. దీని తరువాత వారిద్దరికీ ముగ్గురు పిల్లలు కలిగారు.. అందులో ఇద్దరు కుమారులు మరియు ఒక అమ్మాయి జన్మించారు. దీని తర్వాత ఆమె భర్త 1983 నుండి 1994 వరకు ఉద్యోగం కోసం మిడిల్ ఈస్ట్‌కు వెళ్లాడు. అతను భారతదేశానికి తిరిగి వచ్చాక, తన డబ్బుతో తన భార్య అనవసరమైన ఆస్తిని కొనుగోలు చేసిందని ఆరోపించాడు. దీంతో పాటు భర్త లేకపోవడంతో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యపై నిందలు వేశాడు.

Exit mobile version