Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక నుంచి అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముగ్గురు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులను తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు సినిమా స్టైల్లో ఛేజ్ చేసి పట్టుకున్నారు. బెంగళూరు నుంచి కారులో 300 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను తరలిస్తుండగా కోవిల్‌పాళయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా, నిందితులు ఎస్ఐని పక్కకు తోసేసి కారుతో పరారయ్యేందుకు యత్నించారు.
ఆ సమయంలో నిందితులను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ అత్యంత సాహసంతో పరుగులు తీస్తున్న కారు పైకప్పుపైకి దూకారు. కారుపై పోలీసు వేలాడుతున్నప్పటికీ నిందితులు ఏమాత్రం పట్టించుకోకుండా సుమారు 40 కిలోమీటర్ల దూరం వేగంగా కారును నడిపారు. ఈ వాహనం విళాంకురిచ్చి, కాళపట్టి, సిత్రా మీదుగా కనియూర్ టోల్‌ప్లాజా వైపు దూసుకెళ్లింది. కారు పైకప్పుపై హెడ్ కానిస్టేబుల్ వేలాడుతున్న దృశ్యాలను దారిన పోయే వాహనదారులు తమ సెల్ఫోన్లలో వీడియోలు రికార్డు చేశారు.
Also Read
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
సమాచారం అందుకున్న ఇతర పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కారును వెంబడించారు. అవినాశి పోలీసుల సహకారంతో అన్నపూర్ణ హోటల్ సమీపంలో పోలీసులు ఆ కారును పూర్తిగా చుట్టుముట్టి నిలిపివేశారు. కారు ఆగిన వెంటనే ఇద్దరు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వెంటాడి ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 300 కిలోల గుట్కా, పొగాకు ఉత్పత్తులతో పాటు రవాణాకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కారు పైకప్పుపై 40 కిలోమీటర్లు ప్రయాణించి నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ధైర్యసాహసాలను అభినందిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?