Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay’s TVK Eyes AIADMK Support: తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాతి రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 అడుగుల దూరంలో నిలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీవీకే ప్రతినిధి ఆధవ్ అర్జున.. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 47 సీట్లు గెలుచుకున్న ఏఐఏడీఎంకే మద్దతు కూడగట్టేందుకు విజయ్ వర్గం ప్రయత్నిస్తోంది.
మరోవైపు, ఏఐఏడీఎంకేలోనూ చీలిక సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఓ వర్గం ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా నాలుగు ఎన్నికల్లో (రెండు లోక్‌సభ, రెండు అసెంబ్లీ) ఓటమిని చవిచూసిన ఏఐఏడీఎంకే, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి టీవీకేతో చేతులు కలపడమే మేలని భావిస్తున్నారట. అయితే, సిద్ధాంతపరంగా బద్ధశత్రువులైన వీరిద్దరూ కలుస్తారా? లేక ఏఐఏడీఎంకేలో చీలిక వచ్చి ఒక వర్గం మాత్రమే విజయ్ వైపు వెళ్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.
Also Read
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
ఇదే సమయంలో, ఐదు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయ్‌కు తమ మద్దతును ప్రకటించింది. గిరీష్ చోడంకర్ ఆధ్వర్యంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో “సెక్యులర్ గవర్నమెంట్” ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సైతం ఈ పరిణామాలపై చర్చించారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాకుండా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలను ఏకం చేసి ఒక బలమైన సంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ లేదా ఏఐఏడీఎంకేలోని ఇతర వర్గాలు చక్రం తిప్పకుండా ముందస్తుగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!