Site icon NTV Telugu

Honor killing: మరో పరువు హత్య.. ఎస్ఐ కూతురుతో ప్రేమ.. చంపేయాలని కొడుకుతో చెప్పిన తల్లిదండ్రులు

Kavin

Kavin

ఇటీవలి కాలంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తమ కూతురును ప్రేమిస్తున్నాడని.. సమాజంలో తమ పరువు పోతుందని భావించి ప్రియుడిని చంపేస్తు్న్నారు. కొన్ని సందర్బాల్లో కన్న కూతురును కూడా చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో తమిళనాడులో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎస్ ఐ కూతురుని ప్రేమించినందుకు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమార్తె ప్రేమిస్తున్న ప్రియుడ్ని చంపాలని కూమారుడికి చెప్పారు ఎస్ ఐ దంపతులు శవవణన్,కృష్ణా కూమారి. తల్లిదండ్రుల అదేశాలతో చెల్లి ప్రేమిస్తున్న ప్రియుడు కవిన్ గణేష్ కూమార్ ను నడి రోడ్డులో నరికి చంపాడు ప్రియురాలి అన్న సుర్జిత్. తూత్తుకుడి జిల్లాలోని ఆరుముగమంగళంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read:Kalpika : వివాదాస్పద నటి కల్పిక మరోసారి వార్తల్లోకి.. ఈసారి ఎందుకంటే?

మృతుడు కవిన్ గణేశ్ కూమార్ టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తాతను హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చిన సమయంలో కవిన్ ను హత్య చేశాడు సుర్జిత్. కవిన్ హత్యపై దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. హత్య చేసిన సుర్జిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ ఐ దంపతులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version