Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breakfast Scheme: తమిళనాడు ప్రభుత్వం పాఠశాల పిల్లల కోసం అందిస్తున్న ఉదయం అల్పాహార పథకంలో మరో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ మంగళవారం ఈ పథకం విస్తరణను అధికారికంగా ప్రారంభించారు. తిరువాన్మియూర్ గాంధీ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని పిల్లలకు టిఫిన్ వడ్డించారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి కింద కూర్చొని నాష్టా తిని, వారి క్లాస్‌రూమ్‌కు వెళ్లి సరదాగా కాసేపు ముచ్చటించారు. దివంగత పూర్వ ముఖ్యమంత్రి కే. కామరాజ్ గౌరవార్థం ఈ పథకానికి “పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్” అని పేరు పెట్టారు. ఇప్పటివరకు ప్రాథమిక స్థాయికే పరిమితమైన ఈ ఉచిత టిఫిన్ పథకాన్ని ఇప్పుడు 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని దాదాపు 15.30 లక్షల మంది విద్యార్థులకు కొత్తగా లబ్ధి చేకూరనుంది. పిల్లలు రోజంతా ఉత్సాహంగా చదువుకోవాలంటే ఉదయమే పౌష్టికాహారం అందించడం చాలా అవసరమని భావించి తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విస్తరణ కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 217.63 కోట్ల అదనపు బడ్జెట్‌ను కేటాయించింది. దీంతో ఈ ఉదయం అల్పాహార పథకం మొత్తం బడ్జెట్ బారీగా పెరిగి రూ. 724 కోట్లకు చేరింది. నిజానికి ఈ విస్తరణ కార్యక్రమం సెప్టెంబర్ 17నే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ముఖ్యమంత్రి విజయ్ లండన్ పర్యటన కారణంగా కాస్త ఆలస్యమై మంగళవారం నాటికి వాయిదా పడింది. అయితే చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల్లో మాత్రం ఈ విస్తరణ తక్షణమే అమలులోకి రావడం లేదు. అక్కడ అక్టోబర్ 6న మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నందున, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ రెండు జిల్లాలను తాత్కాలికంగా మినహాయించారు.
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
పిల్లలకు అందించే నాష్టా మెనూలో ఉప్మా, కిచిడీ, పొంగల్ వంటి పోషకాలతో కూడిన రుచికరమైన పదార్థాలను చేర్చారు. అంతేకాకుండా వారంలో రెండు రోజులు చిరుధాన్యాలు (మిల్లెట్స్)తో తయారుచేసిన ఆహారాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థలు ఉమ్మడిగా పర్యవేక్షిస్తాయి. స్కూళ్లలోని స్వయం సహాయక బృందాల (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) మహిళలే స్వయంగా ఈ నాష్టాను వండి పిల్లలకు వడ్డిస్తారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, స్కూళ్లకు హాజరు శాతం పెరుగుతుంది. చదువులోనూ మంచి పురోగతి కనిపిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
తాజావార్తలు
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!