Thalapathy Vijay to honour 10 and 12 Toppers in Tamil Nadu కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసు చాటుకోనున్నారు. తమిళనాడులో ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఆయన బహుమతులు అందించనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గతేడాది ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థినికి డైమండ్ నెక్లెస్‌ను విజయ్ కానుకగా ఇచ్చారు. అలాగే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్థిక సాయం చేశారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు విజయ్ సాయం చేయనున్నారు. ఈ ఏడాదిలో టాపర్లుగా నిలిచిన వారికి సర్టిఫికెట్‌తో పాటు రివార్డులను అందజేయనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్‌లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు.
Also Read: Danni Wyatt Marriage: ప్రియురాలిని పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్.. ఫొటోస్ వైరల్!
ఇటీవలే విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంని ప్రకటించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ ‘ది గోట్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్నా ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది.