Site icon NTV Telugu

Tamannaah : నిమిషానికి కోటి .. తమన్నా రేంజ్ మాములుగా లేదుగా!

Tamannah Bhatiya

Tamannah Bhatiya

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా బ్యాలెన్స్‌గా దూసుకుపొతుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘జైలర్’లో ‘కావాలయ్యా’ , ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కి రాత్’ వంటి స్పెషల్ సాంగ్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమె డిమాండ్ ఆకాశాన్ని తాకింది. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, గోవాలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో కేవలం 6 నిమిషాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం తమన్నా..

Also Read : Gunasekhar : మహేష్ బాబు పెద్ద మాయగాడు.. నా కెరీర్ గ్యాప్‌కు కారణం ఇదే

ఏకంగా రూ.6 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే నిమిషానికి దాదాపు రూ.1 కోటి అన్నమాట. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం సినిమాలే కాకుండా కార్పొరేట్ ఈవెంట్లు, వెడ్డింగ్స్ మరియు స్టేజ్ షోలలో తమన్నా ఉంటే ఆ క్రేజే వేరని నిర్వాహకులు కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు.

కేవలం స్టేజ్ షోలకే కాకుండా, సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం కూడా తమన్నా భారీగానే వసూలు చేస్తోంది. ఇందులో భాగంగా అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్ 2’ (Raid 2) లో ‘నషా’ సాంగ్ కోసం ఆమె సుమారు రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ‘జైలర్’ సినిమా కోసం గతంలో రూ.3 కోట్లు తీసుకున్న ఆమె, ఇప్పుడు తన బ్రాండ్ ఇమేజ్‌ను ‘ప్రీమియం పెర్ఫార్మర్’గా మార్చుకుని రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసింది. అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న తమన్నా, ఇప్పుడు నిమిషాల లెక్కన కోట్లు సంపాదిస్తూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది.

Exit mobile version