Site icon NTV Telugu

Tamannaah Bhatia : బోని కపూర్ అనుమతిస్తే.. తమన్నా కల నెరవేరినట్లే

Tamannaha Dremm Rool

Tamannaha Dremm Rool

సౌత్‌లో ‘మిల్కీ బ్యూటీ’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా టాలీవుడ్‌లో అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2005లో ‘శ్రీ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంటర్ అయిన ఆమె, తెలుగుతో పాటు తమిళం, హిందీ, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని భాషల్లోనూ తనకంటూ భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. లవ్ స్టోరీస్ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ లు, లేడీ ఓరియెంటెడ్ రోల్స్ నుంచి కమర్షియల్ మూవీస్ వరకు అనేక రకాల పాత్రలతో తన నటనలో కొత్తదనం చూపించింది తమన్నా. ఇక ప్రతి ఒక్కరి కెరీర్ లో డ్రీమ్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. తాజాగా తమన్న కూడా మనసులో ఉన్న ఒక పెద్ద కలను బయటపెట్టింది.

Also Read : Akhanda 2 : అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లొకేషన్, టైమింగ్ అవుట్ – ఫ్యాన్స్ రెడీ అవ్వండి!

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. “ ఒకే ఒక్క బయోపిక్ చేసే అవకాశం వస్తే, నేను శ్రీదేవి పాత్ర ఏంచుకుంటా. ఎందుకంటే.. శ్రీదేవి గారిని నేను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను. ఆమె స్టైల్, ఆమె ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ నా ఇన్‌స్పిరేషన్. ఎప్పుడైనా నాకు ఐకానిక్ రోల్ ఇవ్వాలంటే అది శ్రీదేవి గారే. అదే నా లైఫ్ అంబిషన్’ అని తెలిపింది. ప్రజంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌లకు భారీ డిమాండ్ ఉంది.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ,సిల్క్ స్మితగా విద్యాబాలన్, ధోని, మేరీ కోమ్, సంజయ్ దత్ బయోపిక్‌లు.. ఇలా పెద్ద సినిమాలు ప్రేక్షకులను ప్రభావితం చేయడంతో హీరోయిన్స్ కూడా బయోపిక్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే తమన్నా కూడా శ్రీదేవి పాత్రపై ప్రత్యేక ఆసక్తి చూపడం సహజమే. కానీ, ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది..

శ్రీదేవి బయోపిక్‌కు బోనీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఎందుకంటే శ్రీదేవి జీవితాన్ని సినిమాగా చూపించడానికి గతంలోనే కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే బోనీ కపూర్ స్పష్టంగా –“శ్రీదేవి వ్యక్తిగత జీవితం గురించి ఏ సినిమా తీసే అనుమతి ఇవ్వను” అని ప్రకటించడంతో ఆ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అందుకే తమన్నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ముందు బోనీ కపూర్ అంగీకారం అవసరం. బోనీ కపూర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేక తమన్నా డ్రీమ్ రోల్ కలగానే మిగిలిపోతుందా? చూడాలి.

Exit mobile version