నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పవర్‌ఫుల్ కాంబో ఇప్పుడు మరోసారి ‘అఖండ 2’ రూపంలో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన అభిమానుల్లో హైప్ అంచనా దాటిపోయింది. ముఖ్యంగా బాలయ్య లుక్, హావభావాలు, బోయపాటి మాస్ ఎలిమెంట్స్ మళ్లీ థియేటర్లలో దుమ్మురేపే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ 24 గంటల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో నిలిచింది. డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచి అన్‌బిలీవబుల్ రిస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రమోషన్స్‌కు స్పెషల్ జోరు పెంచింది టీమ్. అందులో భాగంగానే అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : Champion : ‘ఛాంపియన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రోషన్–అనస్వర కెమిస్ట్రీ హైలైట్!
ఈ ఈవెంట్‌ను ఈ సారి సాధారణ వేడుకలా కాకుండా టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ లెవెల్‌లోనే కాదు, రాజకీయంగా కూడా హై ప్రొఫైల్ గ్రేసింగ్ ఉండబోతోంది. సమాచారం ప్రకారం, ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అదీ కాకుండా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పెషల్ గెస్ట్‌గా రావాలన్న ప్లానింగ్ ఉందని టాక్. వచ్చే రోజుల్లో దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ రానుంది. ఇక తాజాగా ఈ ఈవెంట్ లొకేషన్, టైమింగ్ ను టీమ్ ఫైనల్‌గా లాక్ చేసింది. నవంబర్ 28న.. కైతలాపూర్ గ్రౌండ్, కుకట్‌పల్లి, హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్‌గా స్టార్ట్ కానుంది అని తెలిపారు. మాస్ అట్మాస్ఫియర్, పెద్ద పెద్ద కటౌట్లు, లైవ్ పెర్ఫార్మెన్సులు ఎలా ఉన్నా ఈ ఈవెంట్ బాలయ్య ఫ్యాన్స్‌కు పండగలా మారనుంది. మొత్తం మీద.. అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు. నవంబర్ 28న కైతలాపూర్ గ్రౌండ్ పూర్తిగా రంగులద్దుకొని అఖండ మాస్ ఫెస్ట్‌లా మారడం ఖాయం!
One of My favourite PowerFull Emotional JukeBox
Loading High 📈💪🏾🙌🏿AUM NAMA SHIVAYA 🔱 #Akhanda2Thaandavam
Performing Nine Songs
With Our Graceful Musicians And Singers ♥️🔥God MODE ON 🔥📈
For Our Lion 🦁 Dearest #NBK Gaaru 🔥 #JaiBalayya pic.twitter.com/a81oFMYPnV
— thaman S (@MusicThaman) November 26, 2025