Site icon NTV Telugu

Tamannaah Bhatia : శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా ‘ఫస్ట్ లుక్’ అదుర్స్ !

Tamannaah Bhatia First Look From Shantaram

Tamannaah Bhatia First Look From Shantaram

బాలీవుడ్ దర్శకుడు శాంతారామ్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న శాంతారామ్ తన సినీ ప్రయాణంలో 90కి పైగా సినిమాలు నిర్మించి, 55 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన సేవలకు పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ బయోపిక్ లో తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ.. తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్ట్ లో తమన్నా చీర కట్టులో సంప్రాదాయ లుక్‌లో చాలా అందంగా ఉంది. ఈ లుక్ చూస్తుంటే,

Also Read : Priyanka Chopra : నా తండ్రి చివరి రోజుల్లో కూడా.. పక్కన ఉండలేకపోయా

ఈ సినిమాలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది. ‘ది రెబెల్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శాంతారామ్ పాత్రను సిద్ధాంత్ చతుర్వేది పోషిస్తుండగా.. అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ బయోపిక్‌ను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇక తమన్నా కొంత కాలంగా తెలుగు, తమిళ సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నప్పటికి త్వరలోనే టాలీవుడ్‌కి రీ-ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తోంది. సమాచారం ప్రకారం, అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రాబోయే సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోందట. హిందీలో శాంతారామ్ బయోపిక్‌తో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్న తమన్నా, ఈ సినిమాలతో మంచి హిట్ కొట్టి మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

Exit mobile version