Tamannaah Denies Marriage with Pakistan Cricketer Abdul Razzaq: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్.. అన్ని భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియా సూపర్ క్రేజ్ సంపాధించారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మిల్కీబ్యూటీ.. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే మాజీ ప్రియుడు విజయ్ వర్మతో ప్రేమాయణంకు ముందు తమన్నాపై చాలా వదంతులు వచ్చాయి. కొందరు హీరో, క్రికెటర్లతో డేటింగ్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డేటింగ్, పెళ్లి రూమర్లపై మిల్కీబ్యూటీ స్పందించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేశారని, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని తమన్నాపై వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 2020లో రజాక్-తమన్నాల మధ్య డేటింగ్, పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. అబ్దుల్ రజాక్‌తో ఉన్న ఫోటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. తాజాగా ఆ వార్తలను మిల్కీబ్యూటీ ఖండించారు. ‘సోషల్ మీడియా, ఇంటర్నెట్ చాలా సరదా ప్రదేశాలు. సోషల్ మీడియా ప్రకారం.. నేను అబ్దుల్ రజాక్‌ను పెళ్లి చేసుకున్నాను. క్షమించండి సార్. మీకు 2-3 మంది పిల్లలు ఉన్నారు. మీ జీవితం గురించి పెద్దగా నాకు తెలియదు కానీ.. ఇలాంటి వార్తలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి వార్తలు చూసినప్పుడు కొన్నిసార్లు న్సవ్వొస్తుంది’ అని తమన్నా చెప్పారు. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ సమయంలో రజాక్, తమన్నా కలిశారు. ఆ ఫొటోనే నెట్టింట వైరల్ అయింది.
Also Read: Bengaluru Stadium: బీసీసీఐకి షాక్.. బెంగళూరులో ప్రపంచకప్ కష్టమే?
2010లో ఒక యాడ్ కోసం విరాట్ కోహ్లీతో తమన్నా నటించారు. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అంటూ న్యూస్ చక్కర్లు కొట్టాయి. కోహ్లీతో డేటింగ్‌పై తమన్నా క్లారిటీ ఇచ్చారు. ‘ఓ యాడ్ షూట్ సమయంలో నేను విరాట్ కోహ్లీని కలిశా. ఒక్క రోజు మాత్రమే కలిశాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ మేం మాట్లాడుకోలేదు, కలవలేదు’ అని తమన్నా చెప్పుకొచ్చారు. ఇటీవలే విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ విడిపోయారు. ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగు, హిందీలోఒక్కో చిత్రం.. ఓ వెబ్ సిరీస్ ఉన్నాయి.
