Site icon NTV Telugu

Tamannaah : ఐటెం సాంగ్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ..!

Tamannaah Bhatia 1 Billion Views, Aaj Ki Raat Song

Tamannaah Bhatia 1 Billion Views, Aaj Ki Raat Song

గ్లామర్ డాల్ తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఆమె క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ఒకవైపు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా తమన్నా ఐటెం సాంగ్స్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్ ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది.

Also Read : Ananya Panday : అనన్యా పాండే కొత్త లవ్ స్టోరీ..

గతేడాది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘స్త్రీ 2’లో తమన్నా ఆడిపాడిన ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ యూట్యూబ్‌లో 100 కోట్ల వీక్షణలను అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ఐటెం సాంగ్‌కు ఈ స్థాయి వ్యూస్ రావడం భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. దీనిపై తమన్నా స్పందిస్తూ.. ‘మీరు చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. పాలరాతి శిల్పం లాంటి అందం, అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో తమన్నా ఈ పాటలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఇంకో షాకింగ్ విషయం ఏంటీ అంటే కేవలం వ్యూస్ లోనే కాదు, పారితోషికం విషయంలోనూ తమన్నా సరికొత్త బెంచ్‌ మార్క్ సెట్ చేస్తోంది. ‘జైలర్’లో నువ్వు కావాలయ్యా సాంగ్ కోసం రూ. 3 కోట్లు తీసుకున్న ఈ మిల్కీ బ్యూటీ, ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ చిత్రంలో ఒకే ఒక్క పాట కోసం ఏకంగా రూ. 6 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈమె చేతిలో రోహిత్ శెట్టి సినిమాలు మరియు ‘రైడ్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీగా సంపాదిస్తూ తమన్నా ‘ఐటెం సాంగ్స్ క్వీన్’గా వెలుగొందుతోంది.

 

Exit mobile version