Tamannah Bhatia : మన పెద్దలు చెప్పినట్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని.. ప్రస్తుతం హీరోయిన్లు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందం, అవకాశం ఉన్నప్పుడే భారీగా సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. ఈ మధ్య ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్స్ మినిమం గ్యారెంటీ అయిపోయింది. ఈ విషయంలో దర్శకనిర్మాతలు తగ్గడం లేదు. ఈ ఒక్క పాటతో సినిమాలకు అదనపు ఆకర్షణ తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పాట విషయంలో అసలు రాజీ పడడంలేదు. చిన్న సినిమాల్లోనైనా సరే ఈ పాటల్లో చేసేందుకు పెద్ద హీరోయిన్లను సంప్రదిస్తున్నారు. వారి అవకాశాన్ని ఆసరాగా తీసుకుని హీరోయిన్లు భారీగా డిమాండ్ చేస్తున్నారు. హీరోయిన్లుగా సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే.. ఐటమ్ సాంగ్ కే ఎక్కువగా అడుగుతున్నారు. తాజాగా ఆ లిస్టులో తమన్నా కూడా చేరింది. తమన్నా ఓ ఐటమ్ సాంగ్ కోసం నిర్మాతలకు కళ్లు తిరిగే రేటు అడిగిందంట.
Read Also:Prabhas: బాహుబలి’ని కొట్టేలా ‘సలార్’ ఇంటర్వెల్ బ్యాంగ్!
బాలయ్య సినిమా అంటే అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ గ్యారంటీగా ఉండాల్సిందే. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో పక్కాగా ఓ ఐటమ్ సాంగ్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ కోసం కూడా సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ఐటెం సాంగ్ ని కంపోజ్ చేస్తున్నాడట. అయితే ఈ పాట కోసం తమన్నాని తీసుకోవాలని అనిల్ ఆలోచిస్తున్నాడట. గతంలో కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ సాంగ్ చేసింది తమన్నా.. ఈసారి కూడా బాలయ్య కోసం తమన్నాను తీసుకోవాలి అనుకున్నాడట. అయితే ఆమె మాత్ర ఒక్క పాటకే రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తుందట. దాంతో నిర్మాతలకు కాస్త షాక్ తగిలినట్టయిందని తెలుస్తోంది. అసలే ఫెయిడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్.. అది కూడా ఐటం సాంగ్ కు అంత డిమాండ్ చేయడం ఏంటీ అని నిర్మాతలు చెవులు కొరుక్కుంటున్నారట. అనిల్ రావిపూడి బాలయ్యతో భారీగానే సినిమా ప్లాన్ చేశాడు. హీరోయిన్ గా కాజల్ ఇప్పటికే సెలక్ట్ అయిపోయింది. ఐటమ్ సాంగ్ తమన్నాతో చేయిస్తున్నాడు. బాలకృష్ణ కూతురిగా ప్రస్తుతం ఫామ్ లో ఉన్న శ్రీలీలను సెలక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకు తమన్నా ఐటమ్ సాంగ్ ఊపు ఊపేస్తుందేమో చూడాలి.
