NTV Telugu Site icon

Thamanna – Vijay Varma : విజయ్ వర్మ తో తమన్నా.. ఆవుట్ సైడ్ కెమెస్ట్రీ సూపర్ గురూ.!

Vijay Varma

Vijay Varma

Thamanna – Vijay Varma : ప్రస్తుతం బి-టౌన్‌లో ఒకే ఒక జంట గురించి చర్చ జరుగుతోంది. వారే తమన్నా భాటియా, విజయ్ వర్మ. వీరిద్దరి మధ్య బంధం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ప్రస్తుతం వారు నటిస్తోన్న చిత్రం లస్ట్ స్టోరీస్ 2 గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన సోమవారం అంటే జూన్ 27న జరిగింది. ఇందులో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ తారాగణం కాజోల్ నుండి నీని గుప్తా వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరయ్యారు. ఇంతమంది వచ్చిన వారందరి కళ్లు తమన్నా, విజయ్ వర్మ పైనే నిలిచిపోయాయి.

లస్ట్ స్టోరీస్ 2 గ్రాండ్ ప్రీమియర్‌లో విజయ్ వర్మ, తమన్నా కలిసి ఎంట్రీ ఇచ్చారు. వెంటనే అందరూ ఆ జంట వైపే దృష్టి కేటాయించారు. తమన్నా, విజయ్ చేయి చేయి కలపారు. దీంతో ఇప్పటి వరకు రూమర్లుగా ఉన్న సంబంధం నిజమేనని స్పష్టమైంది. వారి బంధాన్ని పబ్లిక్ చేశారు. తమన్నా, విజయ్ వర్మ కలిసి పోజులివ్వడం ఇదే మొదటిసారి. ఇద్దరూ కలిసి చాలా అందంగా కనిపించారు. స్క్రీనింగ్ సమయంలో తమన్నా, విజయ్ వర్మ చాలా దగ్గరయ్యారు. విజయ్ వర్మ తమన్నాతో పోజులివ్వడానికి సిగ్గుపడ్డాడు. విజయ్ ఫుల్ బ్లాక్ దుస్తుల్లో కనిపించాడు. అతని బ్లేజర్‌పై ఫ్లవర్ ప్రింట్ చేయబడింది. కాగా తమన్నా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంది. నవ్వుతూంటే తమన్నా కళ్లు విజయ్‌కి దూరం కావడం లేదు. ఇద్దరి అద్భుతమైన కెమిస్ట్రీని ప్రజలు ఇష్టపడుతున్నారు. స్క్రీనింగ్ సమయంలో చిత్రం అంగద్ బేడీ, మృణాల్ ఠాకూర్ ఘాటుగా పోజులిచ్చారు. కాజోల్, నీనా గుప్తా, తిలోత్తమ షోమ్, శ్వేతా త్రిపాఠి, శ్రేయ ధన్వంతి, కొంకణా సేన్ కూడా స్క్రీనింగ్‌కు చేరుకున్నారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది.

Show comments