Talliki Vandanam Scheme: సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆందోళన వద్దు… త్వరలోనే మిగిలిన తల్లికి వందనం సొమ్ము జమ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారని తెలిపారు. తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుందని స్పష్టం చేశారు. ఆ సొమ్ము బ్యాంక్ లింకేజి అయిన విద్యార్థులు/ తల్లి దండ్రుల అకౌంట్ లో మరో 20రోజుల్లో జమ అవుతుందని వెల్లడించారు.
READ MORE: Maredumilli News: సెల్ఫీ వీడియో కలకలం.. కుటుంబసభ్యులే నట్టేట ముంచేశారంటూ..!
“విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసలుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ కేటగిరీలోని విద్యార్థులకు తమ వాటా నిధులు రూ.382.66 కోట్లు జమ చేసింది. ఈ కారణంగా 9, 10 తరగతులు చదివే ఎస్సీ డే-స్కాలర్ విద్యార్థులకు సంబంధించి వారి తల్లి బ్యాంకు ఖాతాకు రూ.10,900, హాస్టల్ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకు రూ.8,800/- చొప్పున జమ చేశాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రూ.5,200/- నుంచి రూ.10,972/- వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్రప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రకటించిన విధంగా మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వం రాబోయే 20 రోజుల్లోపు తల్లులు/విద్యార్థుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.” అని ప్రకటనలో పేర్కొన్నారు.
READ MORE: Kalki Koechlin : భర్తను వేరొకరితో చూడటం చాలా కష్టం.. నటి ఆవేదన!
