Taliban Minister Rehman Haqqani Killed: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో తాలిబాన్ ప్రభుత్వంలోని శరణార్థుల వ్యవహారాల మంత్రి మరణించారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర హోంశాఖ అధికారులు సమాచారాన్ని వెల్లడించారు. మంత్రిత్వ శాఖలో పేలుడు సంభవించడంతో శరణార్థుల వ్యవహారాల మంత్రి ఖలీల్ హక్కానీ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో అతని ముగ్గురు అంగరక్షకులు సహా 12 మంది మరణించారు. మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత బాంబు పేలుళ్లలో మరణించిన ఉన్నతాధికారుల్లో హక్కానీ ఒకరు. ఇకపోతే, ఈ పేలుడుకు ఎవరూ బాధ్యత వహించలేదు.
Also Read: Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా స్మృతి
ఖలీల్ రెహ్మాన్ హక్కానీ మరణం తాలిబాన్లకు పెద్ద దెబ్బ పడినట్లే. పేలుడు అనంతరం కార్యాలయ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. పేలుడు కారణంగా పలువురు గాయపడ్డారు కూడా. మీడియా కథనాల ప్రకారం, పేలుడులో ఆత్మాహుతి బాంబర్ కూడా మరణించాడు. ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఈ దాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. తమ నాయకత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని పేర్కొంది. ఈ సంఘటన తర్వాత, తాలిబాన్ భద్రతను పెంచడానికి ఇంకా అటువంటి దాడులను ఆపడానికి అనేక చర్యలు తీసుకోవడం గురించి అధికారులు వివరాలు వెల్లడించారు.
Also Read: AUS W vs IND W: స్మృతి మందాన సెంచరీ చేసినా.. భారీ తేడాతో ఓడిన భారత్