కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా బస్తీ దవాఖానాలలో సేవలు అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో అన్ని సదుపాయాలు అందిస్తున్నట్లు… రాష్ట్ర పశు సంవర్ధక తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషా మహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రి డివిజన్ లో గల నేతాజీ కమ్యూనిటీ హాల్ లో, జాంబాగ్ డివిజన్ లోని సుబాన్ పురా కమ్యూనిటీ హల్ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Also Read : Expensive Places: ఇక్కడ నివసించాలంటే.. బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉండాలా!
ఒకప్పుడు సర్కారు దవాఖాన కు పోవాలంటే ప్రజలు భయపడే వారని… కానీ ఇప్పుడు సర్కారు దవాఖానకు ప్రజలు క్యూ కడుతున్నారన్నారు. వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్న టెస్టులను ఉచితంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే తమ ప్రధాన ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బస్తి దవాఖానలను ఏర్పాటు చేయడం వల్ల గాంధీ , ఉస్మానియా , నిలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషంట్ ల సంఖ్య తగ్గిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు 350 బస్తి దవాఖానలు ఏర్పాటు చేశామని… రానున్న రెండు మూడు రోజుల్లో మరో 14 ప్రారంభించనున్నట్లు తలసాని స్పష్టం చేశారు.
Also Read : IPL 2023: సిరాజ్ కొత్త ఇంట్లో ఆర్సీబీ ప్లేయర్స్ సందడి
