Site icon NTV Telugu

Talasani Srinivas : సినీ పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం

Talasani

Talasani

శిల్పకళా వేదికలో ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ టీం కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ దగ్గర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు. బాహుబలి సినిమా విశ్వ వ్యాపాతం అయిందని, ఆ సినిమా కు ఆస్కార్ అవార్డ్స్ రావాలని, ఆర్ ఆర్ ఆర్ సినిమా కు వచ్చిందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం సహకారం అందించిందన్నారు. ఈ మధ్య పాన్ ఇండియా సినిమా లు తెలుగు నుండి వస్తున్నాయని, లక్షలాది మందికి అన్నం పెడుతున్న పరిశ్రమ తెలుగు సినిమా అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Chennai-Delhi Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..తప్పిన ప్రమాదం

పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందు ఉంటామని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి వేరే దేశాలకు వెళ్లి షూటింగ్ చేసుకోకుండా ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తారన్నారు. అనంతరం హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ఆర్టిస్ట్ లకు చాలా బాధ్యతలు వున్నాయని, రాజమౌళి బాహుబలి చేసి ఒక మార్క్ పెట్టారన్నారు. కానీ ఇప్పుడు ఇంకో బెంచ్ మార్క్ కు తీసుకెళ్లారు రాజమౌళి అని ఆయన వ్యాఖ్యానించారు. రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కు కంగ్రాట్స్ చెప్పారు.

Also Read : Helmetless Cops : మీరే ఇలా హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపితే ఎలా ?

Exit mobile version