Taj Mahal: తాజ్ మహల్ గోడలను తాకిన యమునా నదీ జలాలు.. 45 ఏళ్లలో మొదటిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rising Yamuna Waters Reach Taj Mahal Walls: ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగ్రా నగరంలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దాంతో 45 సంవత్సరాలలో మొదటిసారిగా సోమవారం నాడు పురాతన కట్టడం తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి.
యమునా నదీ జలాలకు 45 సంవత్సరాలలో మొదటిసారిగా తాజ్ మహల్ వెనుక ఉన్న తోట మునిగిరిపోయింది. యమునా నదిలో నీటి మట్టం 497.9 అడుగులకు చేరుకుంది. వరద నీరు ప్రమాద స్థాయి 495 అడుగులను దాటింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదిలో నీటిమట్టం పెరగడంతో దసరా ఘాట్‌లోకి వరద నీరు చేరింది. ఇతిమద్-ఉద్-దౌలా సమాధి బయటి భాగాలలోకి కూడా నీరు వచ్చేసింది.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
రాంబాగ్, మెహతాబ్ బాగ్, జోహ్రా బాగ్, కాలా గుంబాద్ మరియు చినీ కా రౌజా వంటి స్మారక కట్టడాలకు ముంపు పొంచి ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్మారక చిహ్నాలకు ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరగలేదు. అయితే యమునా నది ప్రవాహం పెరగడం వల్ల తాజ్ మహల్ అందానికి ముప్పు పొంచి ఉందని ఆగ్రా మేయర్ అంటున్నారు.
Also Read: Yaber K2S 4K Projector Price: 200 అంగుళాల స్మార్ట్ టీవీ అనుభూతి.. ధర తక్కువ, సూపర్ సౌండ్!
తాజ్ మహల్ వద్ద ఏఎస్ఐ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి మాట్లాడుతూ… ‘అధిక వరదల సమయంలో కూడా ప్రధాన సమాధిలోకి నీరు ప్రవేశించని విధంగా తాజ్ మహల్ రూపొందించబడింది. చివరిసారిగా తాజ్ మహల్ వెనుక గోడను యమునా నది జలాలు తాకాయి. 1978లో భారీ వరదల సమయంలో యమునా నదీ నీరు తాజ్ మహల్ గోడను తాకింది’ అని అన్నారు.
Also Read: Faf du Plessis Catch: డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్.. ఈ వయసులోనూ సూపర్ డైవింగ్!
After heavy rainfall Yamuna river reaches walls of Taj mahal!
তাজের দুয়ারে যমুনা । pic.twitter.com/ikpgZDJtpU— Anil Bera (@AnilBer75410115) July 18, 2023
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!