Site icon NTV Telugu

Taj Mahal: తాజ్ మహల్ గోడలను తాకిన యమునా నదీ జలాలు.. 45 ఏళ్లలో మొదటిసారి!

Taj Mahal Walls

Taj Mahal Walls

Rising Yamuna Waters Reach Taj Mahal Walls: ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగ్రా నగరంలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దాంతో 45 సంవత్సరాలలో మొదటిసారిగా సోమవారం నాడు పురాతన కట్టడం తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి.

యమునా నదీ జలాలకు 45 సంవత్సరాలలో మొదటిసారిగా తాజ్ మహల్ వెనుక ఉన్న తోట మునిగిరిపోయింది. యమునా నదిలో నీటి మట్టం 497.9 అడుగులకు చేరుకుంది. వరద నీరు ప్రమాద స్థాయి 495 అడుగులను దాటింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదిలో నీటిమట్టం పెరగడంతో దసరా ఘాట్‌లోకి వరద నీరు చేరింది. ఇతిమద్-ఉద్-దౌలా సమాధి బయటి భాగాలలోకి కూడా నీరు వచ్చేసింది.

రాంబాగ్, మెహతాబ్ బాగ్, జోహ్రా బాగ్, కాలా గుంబాద్ మరియు చినీ కా రౌజా వంటి స్మారక కట్టడాలకు ముంపు పొంచి ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్మారక చిహ్నాలకు ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరగలేదు. అయితే యమునా నది ప్రవాహం పెరగడం వల్ల తాజ్ మహల్ అందానికి ముప్పు పొంచి ఉందని ఆగ్రా మేయర్ అంటున్నారు.

Also Read: Yaber K2S 4K Projector Price: 200 అంగుళాల స్మార్ట్ టీవీ అనుభూతి.. ధర తక్కువ, సూపర్ సౌండ్!

తాజ్ మహల్ వద్ద ఏఎస్ఐ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి మాట్లాడుతూ… ‘అధిక వరదల సమయంలో కూడా ప్రధాన సమాధిలోకి నీరు ప్రవేశించని విధంగా తాజ్ మహల్ రూపొందించబడింది. చివరిసారిగా తాజ్ మహల్ వెనుక గోడను యమునా నది జలాలు తాకాయి. 1978లో భారీ వరదల సమయంలో యమునా నదీ నీరు తాజ్ మహల్ గోడను తాకింది’ అని అన్నారు.

Also Read: Faf du Plessis Catch: డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్.. ఈ వయసులోనూ సూపర్ డైవింగ్!

 

Exit mobile version