Site icon NTV Telugu

Taiwan vs China Conflict: 14 చైనీస్ యుద్ధ విమానాలు మా దేశం చుట్టు తిరుగుతున్నాయి..

China Taiwan

China Taiwan

Taiwan: చైనాకు చెందిన 14 వైమానిక దళ విమానాలతో పాటు చైనీస్ యుద్ధనౌకలు తైవాన్ చుట్టూ తిరుగుతునట్లు గుర్తించామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ భూభాగంలోకి ప్రవేశించేందుకు చైనా వైమానిక దళాలు, యుద్ధ నౌకలు ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. మా సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు డ్రాగన్ కంట్రీ గత నాలుగు సంవత్సరాలుగా ద్వీపం చుట్టూ యుద్ధ విమానాలు, యుద్ధనౌకలతో గస్తీ కాస్తుందని తైవాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.

Read Also: Bandla Ganesh : మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

కాగా, ఇవాళ ఉత్తర- నైరుతి తైవాన్ నుంచి పని చేస్తున్న J-16 యుద్ధ విమానాలు, డ్రోన్‌లు 14 చైనీస్ విమానాలను గుర్తించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనా యుద్ధనౌకలతో వైమానికి దళాలు కూడా తైవాన్ జలసంధిని దాటాయని పేర్కొనింది. దీనిపై డ్రాగన్ కంట్రీకి సమాచారం అందించిన ఇప్పటి వరకు దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి తక్షణ స్పందన రాలేదు అని ఆయన చెప్పారు. ఇక, తైవాన్ తన బలగాలను పర్యవేక్షించడానికి పంపినట్లు తెలిపింది.

Read Also: Hyper Aadi : పాలిటిక్స్ లోకి హైపర్ ఆది.. ఎక్కడినుంచి పోటీనో తెలుసా?

అయితే, తైవాన్- చైనా మధ్య గల జలసంధి యొక్క మధ్య రేఖ ఒకప్పుడు రెండు వైపుల మధ్య అనధికారిక అవరోధంగా పని చేసింది అని చైనా తెలిపింది. కానీ, ఇప్పుడు చైనా విమానాలు సాధారణంగానే దాని మీదుగా ఎగురుతూ ఉంటాయి.. ఈ రేఖ ఉనికిపై తమకు నమ్మకం లేదని చైనా చెప్పుకొచ్చింది. ఇక, తైవాన్ లో గత నెలలో వైస్ ప్రెసిడెంట్ లాయ్ చింగ్-తేని తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చైనా ఒక ప్రమాదకరమైన వేర్పాటువాదిగా తైవాన్ అభివర్ణించింది. మేలో అధికారం చేపట్టిన లై, చైనాతో చర్చలకు ప్రతిపాదించగా.. వాటిని తిరస్కరించారు. తైవాన్ ప్రజలు మాత్రమే తమ భవిష్యత్తును నిర్ణయించుకోగలరని ఆయన వెల్లడించారు.

Exit mobile version