Site icon NTV Telugu

Taiwan: చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు.. తైవాన్‌ సంచలన నిర్ణయం

Taiwan

Taiwan

Taiwan: పొరుగుదేశాలపై చైనా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోకి చొరబడడానికి ప్రయత్నించిన చైనా సేనలు.. రెండు రోజులుగా తైవాన్‌ను భయపెట్టేలా భారీస్థాయిలో యుద్ధ విమానాలను బరిలోకి దింపాయి. ఏకంగా 71 విమానాలు తైవాన్‌ జలసంధి మీదుగా దూసుకుపోయాయి. వీటికి తోడు మరో ఏడు యుద్ధ నౌకలూ రంగంలోకి దిగాయి. క్షిపణి వ్యవస్థలతో ఈ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని, తమ గగనతలంలో చైనా వైమానికదళం చేసిన అతి పెద్ద చొరబాటు ఇదేనని తైవాన్‌ సైన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో తైవాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం ఏడాది పాటు తప్పనిసరిగా పని చేసేలా చట్టం తీసుకురానుంది.

తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఈ నేపథ్యంలో తైవాన్‌ అప్రమత్తమవుతోంది. చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం ఏడాది పాటు తప్పనిసరిగా పని చేసేలా చట్టం తీసుకురానుంది. గతంలో కూడా ఆ దేశంలో ఈ చట్టం అమలులో ఉండేది. అయితే, కొంతకాలం క్రితం దీన్ని నాలుగు నెలలకు తగ్గించారు. అంటే ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం నాలుగు నెలలు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయం చాలా తక్కువని అక్కడ చాలా మంది అంటున్నారు. పైగా చైనా నుంచి దాడి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిపాటు సైన్యంలో పని చేసేలా చట్టాన్ని రూపొందిస్తోంది.

Brain Eating Amoeba: మెదడును తినే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం నమోదు

ఇదివరకు ఉన్న నాలుగు నెలల గడువును ఏడాదికి పెంచనుంది. 2024 నుంచి తైవాన్‌ ఈ నిబంధనను అమలు చేయనుంది. ఒకప్పుడు తైవాన్.. చైనాలో భాగంగా ఉండేది. 1949 చైనా సివిల్ వార్ సందర్భంగా, ఆ దేశం నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉంటోంది. కానీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా తైవాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నాడు. చైనా తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలి అనుకుంటుంటే.. తైవాన్ దీనికి నిరాకరిస్తోంది.

Exit mobile version