NTV Telugu Site icon

Bhatti Vikramarka : నాడు బీఆర్ఎస్ ఉద్యోగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా నాలుగు నెలల కోసం వోట్ ఒన్ అకౌంట్ బడ్జెట్ పెట్టామని, 3లక్షల 69 వేల 286 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2 లక్షల 86 వేల పెన్షనర్లకు నెల మొదటి రోజే జీతాలు చెల్లిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగుల ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నెలనెలా జీతాలు చెల్లిస్తున్నామని, నాడు బీఆర్ఎస్ ఉద్యోగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన ఆరోపించారు. నాటి మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ వరకు 52 వేల 118 కోట్లు అప్పు తెచ్చారని, గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు. 64516 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. 24 వేల కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెండించర్ అని, 61,194 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. తెచ్చుకున్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని, రాబోయే రోజుల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను upsc మారిదిగా మారుస్తామన్నార భట్టి విక్రమార్క. ఇది ప్రజా విజయం. మేము ఏ విషయం దాచలేదు. అన్నింటికీ శ్వేతపత్రం విడుదల చేసామన్నారు.

Mopidevi: కన్నులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం
అంతేకాకుండా..’విద్యుత్ శాఖపై సోషల్ మీడియాలో అవాస్తవాలు విచ్చలవిడిగా ప్రచారం చేస్తే ప్రజలు తిప్పి కొట్టారు. 2024లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15623 మెగావాట్లు. 2020 నాటికి 22448 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా పీక్ డిమాండ్ పెరుగుతుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాం. గతానికంటే డిమాండ్ పెరిగినా నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ ను సరఫరా చేశాం. మార్చి8న 2024లో 15624 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. గ్రీన్ ఎనర్జీ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన. 2035 నాటికి 40 వేల మెగావాట్ల హరిత ఇంధనం ఇవ్వడానికి ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో కొత్త విద్యుత్ పాలసీ తీసుకు వస్తాం..’ అని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Sukumar: సుక్కు చేతుల మీదుగా హార్లీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!!

Show comments