NTV Telugu Site icon

CM Revanth Reddy : రేపు పోలేపల్లి జాతరకు సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఉన్న ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, 12:25 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో నారాయణపేట జిల్లా కేంద్రం సింగారంకు చేరుకుంటారు.

సింగారన్‌లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉంది.

మొత్తంగా, ముఖ్యమంత్రి ఈ పర్యటనలో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:10 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణిక రెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

Kishan Reddy : జాబ్ క్యాలెండర్‌ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసింది