Kunamneni Sambasiva Rao : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత సష్టంగా కనిపించిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దాదాపు సగం లోకసభ స్థానాలు బీజేపీ ఎంపిలు గెలిచినా రాష్ట్రానికి సాధించింది సున్నా అని ఆయన అన్నారు. విభజన హామీలను పదకొండేళ్ళువుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేవలం బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయించారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలను పెట్టుకొని ఉద్యోగులు, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువ ఉన్నందునే ఆదాయ పన్ను పరిమితిని పెంచారని, ఇటీవల నిజామాబాద్ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు, అంతకు ముందు ఏడాది ప్రకటించిన గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపుపై స్పష్టత లేదన్నారు..
Pawan Kalyan: బడ్జెట్‌పై పవన్‌కల్యాణ్ ప్రశంసలు.. వికసిత్ భారత్‌కు తోడ్పడుతుందని వ్యాఖ్య
అంతేకాకుండా..’ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. గత నెలలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సుమారు రూ.3లక్షల కోట్లకు సంబంధించిన పథకాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రధాని,ఇతర కేంద్ర మంత్రులు చేశారు. అందుకు సంతోషమే. కానీ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేంద్రం మొండిచేయి చూపింది. మొత్తమ్మీద కేంద్ర బడ్జెట్ ప్రైవేటీకరణకు మరింత బాటలు వేసింది. ఆస్తుల నగదీకరణ పథకం కింద పదేళ్ళలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 లక్షల కోట్లు సేకరించడం, బీమా రంగంలో విదేశీప్రత్యక్ష పెట్టుబడులను 75 నుంచి 100 శాతానికి పెంచారు. అప్పులు 182 లక్షల కోట్లకు చేరాయి. రక్షణ రంగానికి అత్యధికంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు, వ్యవసాయానికి రూ.1.71 కోట్లు కలిపినా, రక్షణ రంగానికి చేరువలో లేవు. గ్రామీణ ఉపాధి మామీ పథకానికి రెండేళ్ళ క్రితం రూ.89,154 కోట్లు కేటాయించగా, ఈ సారి బడ్జెట్ రూ.86వేల కోట్లే కేటాయించారు. కార్పొరేటర్ పన్నులకు సంబంధించి బడ్జెట్ స్పష్టత ఇవ్వలేదు. ఇది కార్పొరేట్ అనుకూల, పేద, మధ్య తరగతి వ్యతిరేక బడ్జెట్.’ అని కూనంనేని సాంబశివరావు అన్నారు.