NTV Telugu Site icon

Kishan Reddy : దేశ భక్తిని పెంపొందించడమే ఈ భారతమాత మహాహరతి కార్యక్రమం ఉద్దేశం

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత మహాహరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతమాత మహారథి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ వర్మకి అలాగే సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఎంఎం కీరవాణి , ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం చే గుర్తించబడిన మాడుగుల నాగఫణి శర్మ, ఈటల రాజేందర్, రఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డికి అలాగే తాజా మాజీ శాసనసభ్యులందరికీ హల్లో ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలకు భారత మాత ఫౌండేషన్ ద్వారా ఉదయ పూర్వక స్వాగతం పలుకుతున్నానన్నారు.

అందరికీ తెలిసిందే 76వ గణతంత్ర దినోత్సవం ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ లక్ష్యాల కోసం మనం అందరం నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు కిషన్‌ రెడ్డి. స్వతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం రచించుకోని ఆమల్లోకి తీసుకురావడం ద్వారా ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.

అంతేకాకుండా..’భారతమాత భారతదేశానికి ప్రతీక ఎవరికైనా అమ్మే తొలి గురువు. భారతమాత అంటే సర్వస్వరూపి సమదృష్టి అని అర్థం. అంబేద్కర్ ఈ ఆలోచనకు పెద్దపీట వేసి మనకి రాజ్యాంగాన్ని అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సబ్కా సార్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు అలాగే సబ్ కా ప్రయాస్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అంబేద్కర్ భావాన్ని మరింత ముందుకు తీసుకువల్సిన అవసరం ఉంది.

భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి సంవత్సరం నెక్లెస్ రోడ్ వేదికగా 8వ సారి భారతమాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేశ భక్తిని పెంపొందించడమే ఈ భారతమాత మహారథి కార్యక్రమం ఉద్దేశం. అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. మనకందరికీ తెలుసు దేశవ్యాప్తంగా జాతీయ భావనను పెంపొందించేలా చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.

అది రామ జన్మభూమి అంశం కావచ్చు పోక్రాన్ అణు పరీక్ష కావచ్చు, కార్గిల్ యుద్ధంలో సైనికులకు అండగా నిలవడం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు కావచ్చు , సర్జికల్ స్ట్రైక్ కావచ్చు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కావచ్చు గత పదేళ్ళలో మోడీ ప్రభుత్వము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం భారతీయ సాంప్రదాయం పట్టం కట్టే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ భారత మాత మహా హారతి కార్యక్రమం నేటి తరానికి భావితరానికి నవతరానికి మన భారతదేశ గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము సందర్భంగా భారతమాత గురించి అటల్ బీహార్ వాజ్పేయి అన్న మాటలను గుర్తు చేసుకోవాలి.’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Yogi Adityanath: ‘‘సనాతన ధర్మం జాతీయ మతం’’..సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..