NTV Telugu Site icon

CM Chandrababu : నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu

Chandrababu

CM Chandrababu : వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్‌ విధానాల కారణంగా అస్తవ్యస్థంగా మారిన పోలవరానికి కూటమి ప్రభుత్వం జీవం పోసి పనులను వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరానికి వెళ్లి ప్రాజెక్టు పనులను సమీక్షించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ప్రాజెక్టు వ్యూ పాయింట్‌ వద్దకు చేరుకుని అక్కడి హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. పనుల పురోగతిని పరిశీలించిన తరువాత, ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాస అంశాలపై అధికారులతో సమావేశమవుతారు.

తాను అధికారం చేపట్టిన తర్వాత పోలవరానికి చేస్తున్న తొలి పర్యటనతో సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై తన కట్టుబాటును మరోసారి చాటారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ప్రతినెలా సోమవారం పోలవరానికి వెళ్ళి పనులను సమీక్షించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ కార్యక్రమానికి పునరుజ్జీవం ఇస్తున్నారు. ఈ పర్యటన రైతులు, నిర్వాసితుల్లో ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారంపై కొత్త ఆశలను నింపుతోంది.

Zakir Hussain: తీవ్ర విషాదం.. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌ కన్నుమూత

2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, పనుల షెడ్యూల్‌ను సీఎం నేడు ప్రకటించనున్నారు. డయాఫ్రంవాల్‌, ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ వంటి ముఖ్య పనులకు ప్రాధాన్యమిస్తూ గైడ్‌బండ్‌ను పునర్నిర్మాణం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనులు, ఐకానిక్‌ వంతెన నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు.

నిర్వాసితుల పునరావాసం కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 13 కాలనీలు నిర్మించేందుకు ప్రణాళిక చేయబడింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు నిలిచిపోయాయి. దీంతో నిరాశ్రయులైన 19 గ్రామాల ప్రజలకు తగిన సౌకర్యాలు లేని అసంపూర్ణ కాలనీలతో బాధలు ఎదురవుతున్నాయి. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లుగా గుత్తేదారులకు రూ.210 కోట్ల బకాయిలను నిలిపివేసింది. తాజా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాత బకాయిల చెల్లింపులతోపాటు పునరావాసానికి రూ.502 కోట్లను కేటాయించింది. నేటి పర్యటనలో సీఎం చంద్రబాబు పరిహార చెల్లింపులపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు పరిధిలో 12 వేల ఎకరాల భూమి సేకరించి, 25 వేల కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. వీరిలో 44 గ్రామాలకు చెందిన 10 వేల కుటుంబాలు 41.15 కాంటూరు పరిధిలో ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 17 మండలాలు, రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లోని 7.2 లక్షల ఎకరాల పంటభూములకు సాగునీరు అందించవచ్చు.

Harish Rao : అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడు

Show comments