NTV Telugu Site icon

Taapsee Pannu Marriage: అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా: తాప్సీ

Taapsee Pannu

Taapsee Pannu

Taapsee Pannu React on Her Marriage with Mathias Boe: హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రియుడు మథియాస్‌ బోను వివాహం చేసుకున్నారు. మార్చి 20న తాప్సీ, మథియాస్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు జరగ్గా.. ఉదయ్‌పుర్‌లో మార్చి 23న పెళ్లి జరిగింది. తాప్సీ తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా.. వివాహంకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీకైంది. పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడానికి గల కారణాన్ని తాజాగా తాప్సీ చెప్పారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 36 ఏళ్ల తాప్సీ మాట్లాడుతూ… ‘నా వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు గోప్యంగా ఉంచాలనుకున్నా. నా పెళ్లికి సంబంధించిన విషయాలను బయటకు చెప్పి.. అందరిలో ఆసక్తి పెంచాలనుకోలేదు. పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంలో నా భర్తకు, నా తల్లిదండ్రులకు మరో అభిప్రాయం ఉండొచ్చు. పెళ్లి విషయం మీడియాలో కానీ, సోషల్‌ మీడియాలో కానీ చెప్పలేదు’ అని అన్నారు.

Also Read: Nitish Reddy Record: ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.. నితీశ్‌ రెడ్డి సంచలన రికార్డు!

‘పెళ్లి చేసుకున్న సంగతిని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కాదు. నా సన్నిహితులు, కుటుంబసభ్యులు మొదటి నుంచి పెళ్లిలో భాగమయ్యారు. వాళ్లకు అన్నీ తెలుసు. కుటుంబసభ్యుల అంగీకారంతోనే మేం వివాహం చేసుకున్నాం. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఆనందంగా చేసుకోవాలనుకున్నా. అందుకే ఆర్భాటాలకు చోటివ్వకుండా.. కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం. నా పెళ్లి ఫొటోలు, వీడియోలను పంచుకోవడానికి ఇప్పుడే సిద్ధంగా లేను. నాకు షేర్‌ చేయాలనిపించినపుడు చేస్తా’ అని తాప్సీ తెలిపారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే తాప్సీకు మథియాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారగా.. పదేళ్లు రిలేషన్‌లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తాప్సీ ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’లో నటిస్తున్నారు.

 

Show comments