Taapsee Pannu Marriage: అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా: తాప్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taapsee Pannu React on Her Marriage with Mathias Boe: హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రియుడు మథియాస్ బోను వివాహం చేసుకున్నారు. మార్చి 20న తాప్సీ, మథియాస్ ప్రీవెడ్డింగ్ వేడుకలు జరగ్గా.. ఉదయ్పుర్లో మార్చి 23న పెళ్లి జరిగింది. తాప్సీ తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా.. వివాహంకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీకైంది. పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడానికి గల కారణాన్ని తాజాగా తాప్సీ చెప్పారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 36 ఏళ్ల తాప్సీ మాట్లాడుతూ… ‘నా వ్యక్తిగత జీవితాన్ని వీలైనంత వరకు గోప్యంగా ఉంచాలనుకున్నా. నా పెళ్లికి సంబంధించిన విషయాలను బయటకు చెప్పి.. అందరిలో ఆసక్తి పెంచాలనుకోలేదు. పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంలో నా భర్తకు, నా తల్లిదండ్రులకు మరో అభిప్రాయం ఉండొచ్చు. పెళ్లి విషయం మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ చెప్పలేదు’ అని అన్నారు.
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
Also Read: Nitish Reddy Record: ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.. నితీశ్ రెడ్డి సంచలన రికార్డు!
‘పెళ్లి చేసుకున్న సంగతిని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం కాదు. నా సన్నిహితులు, కుటుంబసభ్యులు మొదటి నుంచి పెళ్లిలో భాగమయ్యారు. వాళ్లకు అన్నీ తెలుసు. కుటుంబసభ్యుల అంగీకారంతోనే మేం వివాహం చేసుకున్నాం. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఆనందంగా చేసుకోవాలనుకున్నా. అందుకే ఆర్భాటాలకు చోటివ్వకుండా.. కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం. నా పెళ్లి ఫొటోలు, వీడియోలను పంచుకోవడానికి ఇప్పుడే సిద్ధంగా లేను. నాకు షేర్ చేయాలనిపించినపుడు చేస్తా’ అని తాప్సీ తెలిపారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే తాప్సీకు మథియాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారగా.. పదేళ్లు రిలేషన్లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తాప్సీ ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!