Site icon NTV Telugu

T20 World Cup : నేటి నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక‌

T20 World Cup

T20 World Cup

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసే టీ20 వరల్డ్‌ కప్‌ రానేవచ్చింది. నేటి నుంచి వరల్డ్‌ కప్‌ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. అయితే.. తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు నబీమియా జట్టుతో తలపడనుంది. అయితే.. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకున్న‌ది. మొత్తం 16 టీమ్‌లు టైటిల్ కోసం తలపడనున్నాయి. అయితే.. ఆదివారం నుంచి తొలి రౌండ్ అర్హ‌త మ్యాచ్‌లు జ‌రుగ‌తున్నాయి. సూప‌ర్ 12లో చోటు కోసం మొత్తం ఎనిమిది టీమ్‌లు త‌ల‌ప‌డ‌నుండగా.. ఇందులో గ్రూప్-ఏ లో భాగంగా నేడు న‌మీబియాను శ్రీలంక‌ ఢీ కొట్టనుంది. నేడు జ‌రుగ‌నున్న మ‌రో మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్‌తో యూఏఈ పోటీ పడనుంది. గ్రూప్‌-బీలో వెస్టిండీస్‌, జింబాబ్వే, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ జట్టు ఉన్నాయి.

ఇందులో గెలిచిన 2 టీమ్‌లు సూప‌ర్ 12కు అర్హ‌త పొందుతాయి. ఆదివారం నుంచి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు జ‌రుగ‌నుంది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్. అయితే.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండటం విశేషం. అయితే.. గ్రూప్ బీలో ఇండియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఆప్ఘ‌నిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. తొలి రౌండ్‌లో గెలిచిన రెండు జ‌ట్లు వీటితో పాటుగా చేరుతాయి. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య అక్టోబ‌ర్ 23న మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది.

Exit mobile version