NTV Telugu Site icon

Virat Kohli: నిజం చెబుతున్నా.. ఆ రోజు చాలా భయపడ్డా: కోహ్లీ

Virat Kohli India

Virat Kohli India

Virat Kohli on 2011 World Cup debut match: వెస్టిండీస్‌, యూఎస్ వేదికలుగా మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న ప్రపంచకప్‌ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత జట్టు న్యూయార్క్‌ చేరుకొని ప్రాక్టీస్ చేస్తోంది. ఐపీఎల్‌ 2024లో భారీగా పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో విరాట్ చెలరేగుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌ 2024 నేపథ్యంలో తాను తొలిసారి ప్రపంచకప్‌ ఆడినప్పటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌ తనకు మొదటిదని, ఆ రోజు చాలా భయపడ్డా అని తెలిపాడు. ‘ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో నా తొలి ప్రపంచకప్‌ మ్యాచ్ ఆడా. ఆ సమయంలో చాలా భయపడ్డా. నిజమే చెబుతున్నా. చాలా ఆందోళనకు గురయ్యా. ఎందుకంటే.. ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడటం వేరు, ప్రపంచకప్‌లో ఆడడం వేరు’ అని విరాట్ చెప్పాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 83 బంతుల్లో సెంచరీ చేశాడు.

Also Read: Nivetha Pethuraj: నేను ఓపెన్ చేయనంటూ.. పోలీసులతో నివేతా పేతురాజ్‌ గొడవ! వీడియో వైరల్

‘2011 వన్డే ప్రపంచకప్‌లో జట్టులో నేనే చిన్న వయసు క్రికెటర్‌ను. సచిన్, సెహ్వాగ్, జహీర్, హర్భజన్, ధోనీ, గంభీర్ లాంటి గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం అద్భుతం. మ్యాచ్‌కు ముందు రోజు కూడా నేను చాలా ఆందోళనగానే ఉన్నా. అవన్నీ మంచి శకునాలే. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తే జట్టుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకోసం మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యా. నా ప్రణాళికలను అమలు చేసేందుకు ఆ ఆందోళన సాయపడిందని అనుకుంటా’ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.