NTV Telugu Site icon

యూట్యూబ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ‘T-సిరీస్’

యూట్యూబ్‌లో T-సిరీస్ ఛానల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. T-సిరీస్ ఛానల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఈ మైలురాయి దాటిన మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా అవతరించింది. ప్రపంచంలో మరే ఇతర ఛానల్ ఈ ఫీట్ సాధించలేదు. భూషణ్ కుమార్‌కు చెందిన T-సిరీస్ భారతదేశంలోనే అతి పెద్ద మ్యూజిక్ కంపెనీగా కొనసాగుతోంది. T-సిరీస్ పేరుతో బాలీవుడ్‌లో పలు సినిమాలు కూడా నిర్మితం అవుతున్నాయి.

Read Also: మరోసారి చిక్కుల్లో విజయ్ సేతుపతి

కాగా ఈ విజయాన్ని సంస్థ సభ్యులకు, మ్యూజిక్ టీమ్‌కు అంకితం చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ప్రకటించారు. ఇంత పెద్ద స్థాయిలో తమ ఛానల్ సబ్‌స్రైబర్‌లను పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్‌కు చెందిన ఓ మ్యూజిక్ సంస్థ ఈ ఘనత సాధించడం భారతీయులందరికీ గర్వకారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా యూట్యూబ్‌లో T-సిరీస్‌ పేరుతో వేర్వేరు భాషల్లో 29 ఛానెళ్లు ఉన్నాయి. T-సిరీస్‌కు చెందిన ఈ ఛానళ్లు అన్నింటికి కలిపి ఇప్పటివరకు 718 బిలియన్‌లకు పైగా వీక్షణలు వచ్చినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.