NTV Telugu Site icon

Syria: దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు.. 13 ఏళ్లుగా అంతర్యుద్ధం.. 5 లక్షల మరణాలు

Syrialebanon

Syrialebanon

ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు గ్రూపుల సంకీర్ణం సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ పశ్చిమాసియా దేశంలో 24 ఏళ్ల బషర్ అల్ అసద్ పాలనకు తెరపడింది. అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు! నియంతృత్వానికి వ్యతిరేకంగా 2008లో ట్యునీషియాలో మొదలైన అరబ్ స్ప్రింగ్ మూడేళ్ల తర్వాత 2011లో సిరియాకు చేరుకుంది. బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ మొదలైన తిరుగుబాటు త్వరగా అంతర్యుద్ధంగా మారింది. అప్పుడు, సిరియన్ తిరుగుబాటు గ్రూపులు, తీవ్రవాద సమూహాలతో పాటు, అమెరికా, ఇరాన్, రష్యాతో సహా అంతర్జాతీయ శక్తులు ఈ అంతర్యుద్ధంలో పాలుపంచుకున్నాయి. ఇది బహుళ-డైమెన్షనల్ వివాదంగా మారింది. 13 సంవత్సరాల పాటు సాగిన అంతర్యుద్ధంలో 500,000 (5లక్షలు) కంటే ఎక్కువ మంది సిరియన్లు ప్రాణాలు వదిలారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

READ MORE: Jagadish Reddy: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే..

54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర..
సిరియా రాజధాని డమాస్కస్​ను తిరుగుబాటుదారులు అధీనంలోకి తీసుకోవడం వల్ల అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో కలిసి దేశాన్ని విడిచివెళ్లారని వార్తలు వస్తున్నాయి. దీంతో అసద్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలినట్లు కనిపిస్తోంది. అసద్ నిష్క్రమణతో సిరియాలో 54 ఏళ్ల ఆయన కుటుంబ పాలనకు తెరపడినట్లవుతుంది. అసద్ తండ్రి హఫీజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణించేంతవరకు (2000) సిరియాను పాలించారు. ఆ తర్వాత అసద్ సిరియా పగ్గాలు అందుకున్నారు. తాజాగా తిరుగుబాటుదారులు దేశ రాజధానిని అధీనంలోకి తీసుకోవడం వల్ల సిరియాను వీడినట్లు తెలుస్తోంది.

READ MORE: Jagadish Reddy: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే..