Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బరోడా, సిక్కిం మధ్య జరిగిన మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసింది. ఇందులో భాను పునియా 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో బరోడా ఇన్నింగ్స్‌లో మొత్తం 37 సిక్సర్లు నమోదయ్యాయి. దీనితో టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీంగా ప్రపంచ రికార్డును బరోడా సృష్టించింది. ఈ ఏడాది అక్టోబరు 23న గాంబియాపై 344 పరుగులు చేసిన జింబాబ్వే పేరిట టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు అంతకుముందు ఉండేది. అంతేకాదండోయ్.. ఈ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. జింబాబ్వే ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 27 సిక్సర్లు కొట్టింది. తాజా మ్యాచ్ తో బరోడా జట్టు మొత్తం 37 సిక్సర్లు కొట్టింది. దాంతో ఆ రికార్డ్ కూడా బద్దలైంది. అందులో 15 సిక్సర్లు భాను పూనియా బ్యాట్ నుండి వచ్చాయి.
Also Read: Pushpa 2 : రాజమౌళి మాటలను నిజం చేసిన చుపించిన సుకుమార్
కృనాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా జట్టు తరఫున హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. ఈ మ్యాచ్‌లో బరోడాకు చెందిన నలుగురు ఆటగాళ్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశారు. శశ్వత్ రావత్, అభిమన్యు సింగ్‌లు కలిసి శుభారంభం చేసి 5 ఓవర్లలో తొలి వికెట్‌కు 90 పరుగులు చేశారు. అభిమన్యు 17 బంతుల్లో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం 43 పరుగుల వద్ద శశ్వత్ ఔటయ్యాడు. ఆ తర్వాత భాను, శివాలిక్ శర్మ కలిసి విధ్వంసం సృష్టించారు. ఇందులో భాగంగా శివాలిక్ కేవలం 17 బంతుల్లో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. విష్ణు సోలంకి 16 బంతుల్లో 50 పరుగులు చేశాడు. భాను 51 బంతుల్లో ఐదు ఫోర్లు, 15 సిక్సర్లతో 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో లక్ష్య ఛేదనలో సిక్కిం కేవలం 86 పరుగులకే పరిమితం కావడంతో బరోడా 263 పరుగుల భారీ విజయాన్ని కూడా అందుకుంది.
అయితే, టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును భాను బద్దలు కొట్టలేకపోయాడు. భాను మరో నాలుగు సిక్సర్లు కొట్టి ఉంటే ఈ ప్రపంచ రికార్డు కూడా ధ్వంసమయ్యేది. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పూర్ రైడర్స్ తరపున ఆడుతున్న గేల్ ఢాకా డైనమైట్స్‌పై 146 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 18 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో బరోడా కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే మొత్తం 294 పరుగులు చేసింది. ఇది ఒక ఇన్నింగ్స్‌లో బౌండరీలతో అత్యధిక పరుగులు.