Swiggy: లంచ్ టైమ్ అయ్యిందా.. గబుక్కున గుర్తొచ్చేవి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. చాలా మంది ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. వంట చేసుకోవడానికి టైమ్ లేదనుకుంటే.. ఇప్పుడు తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా మారిపోయింది హ్యూమన్ లైఫ్ స్టైల్. దొరికిన కాసింత టైమ్ లో గబగబా తినేస్తూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకొచ్చాయి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. స్విగ్గీ, జొమాటో ఆహార ప్రియులకు కోరుకున్న ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటి వద్దకే వస్తుండడంతో ఫుడ్ డెలివరీ యాప్స్ కు డిమాండ్ పెరిగింది.
Also Read: BSNL Offer: డేటా అవసరం లేదా.? కేవలం కాల్స్ కోసం బెస్ట్ ఆఫర్ ఇదే..
ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను, సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఆయా సంస్థలు. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పండగ వేళ కస్టమర్లకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. SNACC పేరిటి కొత్త యాప్‌ను లాంఛ్ చేసింది. దీని సాయంతో నిమిషాల్లోనే మీ ఆర్డర్ ను పొందే వీలుంటుంది. SNACC పేరిట తీసుకొచ్చిన ఈ యాప్ సహాయంతో క్విక్ బైట్స్, బేవరేజెస్, ఫుడ్ డెలివరీలను అందుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నారు. స్విగ్గీ తీసుకొచ్చిన ఈ కొత్త సేవలతో కస్టమర్లకు త్వరగా ఆర్డర్స్ డెలివరి కానున్నాయి. ఇప్పటికే ఈ సేవలను బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఇతర ప్రాంతాల్లోనూ ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Also Read: MG Windsor EV: కొనుగోలుదారులకు షాక్.. కార్ల ధరను భారీగా పెంచేసిన ఎంజీ
ఇక జొమాటో అనుబంధ సంస్థ బ్లింకిట్ 10 నిమిషాల్లోనే స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలను డెలివరీ అందించేందుకు బిస్ట్రో యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక జెప్టో సైతం కేఫ్ ఆఫరింగ్స్ కోసం ‘జెప్టో కేఫ్’ పేరిట యాప్‌ను లాంచ్ చేసింది. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కస్టమర్లకు వరంగా మారిపోయింది. ఫుడ్ ఆర్డర్లపై డిస్కౌంట్ ఆఫర్లు, స్పెషల్ ఫీచర్స్ అందిస్తుండడంతో ఫుడ్ లవర్స్ కు ప్రయోజనకరంగా మారాయి. కాగా స్విగ్గీ తీసుకొచ్చిన స్నాక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లో అందుబాటులో ఉంది.