NTV Telugu Site icon

Swiggy Ambulance: ఇక అందుబాటులోకి స్విగ్గీ అంబులెన్సులు

Swiggy

Swiggy

Swiggy Ambulance: తెలంగాణలో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పై నుండి పడి మరణించాడు. నాలుగు రోజుల క్రితం డెలివరీ కోసం వెళ్లి, కుక్క నుండి తప్పించుకునే సమయంలో భవనం మొదటి అంతస్తు నుండి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో స్విగ్గీ యాజమాన్యం స్పందించింది. తన యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, వారిపై ఆధారపడిన వారి కుటుంబీకుల కోసం అన్ని రకాల అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఉచిత అంబులెన్స్ సేవను ప్రకటించింది. దీని కోసం ఫుడ్‌టెక్ దిగ్గజం Dial4242 అంబులెన్స్ సేవలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్విగ్గీ తన యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లందరికీ, వారిపై ఆధారపడిన వారికి (భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు) ఈ సేవ ఉచితంగా అందజేస్తుంది. ప్రమాదంలో ఉన్న వారు స్విగ్గీ డెలివరీ ఏజెంట్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా యాప్‌లోని SOS బటన్‌ను నొక్కడం ద్వారా సేవలను ఉపయోగించవచ్చు.

Read Also: BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. @టార్గెట్ 2024

కేసు తీవ్రత ఆధారంగా BLS (బేసిక్ లైఫ్ సపోర్ట్), కార్డియాక్, ALS (అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్), ఇంటర్-స్టేట్, కోవిడ్-19 అంబులెన్స్‌లు, హియర్స్ వ్యాన్‌లతో సహా వివిధ అంబులెన్స్‌లను పంపనున్నట్లు Swiggy ప్రకటించింది. తెలంగాణలో జరిగినట్లుగానే.. కొత్త సంవత్సరం సందర్భంగా నోయిడాలో Swiggy డెలివరీ ఏజెంట్ అయిన కౌశల్ కారు ప్రమాదంలో చనిపోయాడు. కారు ఢీకొన్న తర్వాత కౌశల్ ను సుమారు కి.మీ దూరం లాక్కుపోయింది. అనంతరం మృతుడి కుటుంబీకులు నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబులెన్స్ సేవ గురించి CEO శ్రీహర్ష మెజెటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం 500 పైగా నగరాల్లో స్విగ్గీ తన సేవలను కొనసాగిస్తోందన్నారు. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన 12నిమిషాల్లో అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో డెలివరీలను సురక్షితంగా చేయడానికి ఆన్-డిమాండ్, వేగవంతమైన, ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించామన్నారు.