Site icon NTV Telugu

Sweet Corn : స్వీట్ కార్న్ చేసే మేలు తెలిస్తే.. అసలు వదలరు..!

Sweet Corn

Sweet Corn

మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వీట్ కార్న్ లో పోషకాలు మెండుగా ఉన్నాయి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ రాకుండా అడ్డుకోవచ్చు. స్వీట్ కార్న్‌లో క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి.. దాంతో మనకు కడుపు నిండిన భావనను కలిగి ఉంటుంది.. ఎక్కువ సేపు తిండిని తీసుకోవడానికి ఆసక్తి చూపించరు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది..

స్వీట్ కార్న్‌లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా లుటీన్‌, జియాజాంతిన్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల స్వీట్ కార్న్‌ను తింటే కళ్లు సురక్షితంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా ఉంటాయి. అలాగే కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. స్వీట్ కార్న్‌లో సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉంటారు. ఇలా స్వీట్ కార్న్‌ను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.. అందుకే ఇప్పటి నుంచి స్వీట్ కార్న్ ను తినడం అలవాటు చేసుకోండి..

Exit mobile version